Moviesక‌ళ్లు చెదిరి... మైండ్ పోయే రేటుకి ' రాధే శ్యామ్ '...

క‌ళ్లు చెదిరి… మైండ్ పోయే రేటుకి ‘ రాధే శ్యామ్ ‘ డిజిట‌ల్ రైట్స్ డీల్ క్లోజ్‌..!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సీరిస్ సినిమాల‌తో పాటు సాహో సినిమా త‌ర్వాత నేష‌న‌ల్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ప్ర‌భాస్ నుంచి సినిమా వ‌స్తుందంటే చాలు పాన్ ఇండియా రేంజ్‌లోనే అంచ‌నాలు ఉన్నాయి. జిల్ ఫేం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమా యూర‌ప్ నేప‌థ్యంలో పున‌ర్జ‌న‌ల క‌థ ఆధారంగా తెర‌కెక్కుతోంద‌ట‌. పూజాహెగ్డే ప్ర‌భాస్ ప‌క్క‌న హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాపై ఉన్న భారీ అంచ‌నాల నేప‌థ్యంలో రాధే శ్యామ్ డిజిట‌ల్ రైట్స్ డీల్ క్లోజ్ అయ్యింద‌ని స‌మాచారం.

క‌ళ్లు చెదిరిపోయే రేటుకు రాధే శ్యామ్ డిజిట‌ల్ రైట్స్‌ను జీ సంస్థ కొనుగోలు చేసింద‌ని తెలుస్తోంది. ఒక్క హిందీ హక్కులు మినహా మిగతా భాషల హక్కులను జీ సంస్థ ద‌క్కించుకుంద‌ట‌. హిందీ రైట్స్ మాత్రం నెట్ ఫ్లిక్స్ సంస్థ ద‌క్కించుకుంద‌ని చెపుతున్నారు. ఓవ‌రాల్‌గా రాధే శ్యామ్‌కు నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ ద్వారానే నిర్మాత‌ల‌కు రు. 250 కోట్లు జేబులో ప‌డిన‌ట్టు చెపుతున్నారు. అంటే సినిమా పెట్టుబ‌డి మొత్తం రిక‌వ‌రీ కావ‌డంతో పాటు ఇప్ప‌టికే లాభాల్లోకి వ‌చ్చేశార‌నే అంటున్నారు.

ఇది బాహుబలి, సాహో కంటే చాలా ఎక్కువ‌. ఇక థియేట్రిక‌ల్ బిజినెస్ ఏ రేంజులో ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. రాధే శ్యామ్‌కే ఈ రేంజులో బిజినెస్ జ‌రిగిందంటే.. స‌లార్ – ఆదిపురుష్ సినిమాల రేంజ్ ఎలా ఉంటుందో ? ఊహించుకోవ‌చ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news