Healthఈ పండు కుళ్లిన తర్వాతే తినాలనే విషయం మీకు తెలుసా..??

ఈ పండు కుళ్లిన తర్వాతే తినాలనే విషయం మీకు తెలుసా..??

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. నేలతల్లి ప్రసాదించిన వరాల్లలో ముఖ్యమైనవి పండ్లు కూడా ఒకటి. పండ్లు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము. డాక్టర్లు మందుల చీటిలో మందుల్ని రాసి పంపే ముందు… ‘మీరు పండ్లు ఎక్కువగా తినండి’ అని నోటిమాటగా చెబుతారు. ఒక్కో ఫలానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ప్రపంచంలో లభించే పండ్లలో ఒక్కో పండుదీ ఒక్కో ప్రత్యేకత. రంగు, రుచి, వాసన, పోషక విలువల్లో దేనికదే సాటి! ఏదీ తక్కువ కాదు, ఏదీ ఎక్కువ కాదు. అడవుల్లోని ఆదిమానవుడి తొలి ఆహారం పండ్లు.

అయితే ఇప్పుడు గుట్టలు గుట్టలుగా వచ్చి పడుతున్న జంక్‌ఫుడ్‌ మాయలో పడిపోయిన తరం.. పండ్లను తినడం తగ్గించారు. అన్నంతో అవసరం లేకుండా ప్రకృతి సిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర తృణ ధన్యాలను ఆహారంగా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావలసిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి. ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యులు సూచిస్తారు.

ప్రపంచంలో లభించే పండ్లలో ఒక్కో పండుదీ ఒక్కో ప్రత్యేకత. అలాగే ఈ పండుకూ ఓ ప్రత్యేకత ఉన్నది. దీనిని కుళ్లిన తర్వాత మాత్రమే తినడానికి పనికొస్తుంది. ఆ ఫలం పేరు మెడ్లర్.ఒకప్పుడు యూరప్‌లో ఈ పండుకి విపరీతమైన డిమాండ్ ఉండేది. క్రీస్తు పూర్వం 7వ శతాబ్దానికి చెందిన గ్రీకు కవిత్వంలో ఈ ఫ్రూట్ ప్రస్తావన కనిపిస్తుంది. నెమ్మదిగా ఈ ఫలం రోమన్ల చేతిలోకి వెళ్లిపోయింది. క్రీస్తుశకం 800లో రాజుల తోటల్లో ఈ చెట్టు కచ్చితంగా ఉండేది.

ఇవి అస్తవ్యస్తంగా ఉన్న ఉల్లిపాయ ఆకారంలో ఉంటాయి.వీటిని నేరుగా తింటే తీవ్ర అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉందని 18వ శతాబ్దపు వైద్యులు పేర్కొన్నారు. కానీ వీటిని కొన్ని వారాలపాటు మగ్గబెట్టి కుళ్లిన తర్వాత తింటే మంచిదని చెప్పారు. వీటి రుచి కాల్చిన ఆపిల్‌లా ఉంటుంది.

ఈ పండులో అంతు చిక్కని రసాయన చర్య జరుగుతుంది. “మెడ్లర్ ఒక కుళ్లిన ఆపిల్ కంటే రుచిగా ఉంటుంది” అని మధ్యయుగం నాటి ఒక ప్రచురణలో రాశారు. ఈ చెట్టును ఆపిల్, గులాబీ, సీతాఫలానికి దగ్గరగా ఉండే జాతిగా చెబుతారు. ఈ చెట్లు చాలా అసాధారణమైనవి. ఇవి డిసెంబరులోమాత్రమే కాస్తాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news