యువరత్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బాలయ్య సినిమా ఎవరితో అన్న విషయంలో క్లారిటీ వచ్చేసింది. దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలయ్య నెక్ట్స్ సినిమా ఉండబోతోంది. క్రాక్ సినిమా పూర్తయిన వెంటనే బాలయ్య కోసం గోపీచంద్ స్క్రిఫ్ట్ రెడీ చేసేశాడు. మైత్రీ మూవీస్ వారు ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఓ వాస్తవ సంఘటన ఆధారంగా గోపీచంద్ ఈ సినిమా కథ రెడీ చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఆ ఇద్దరి హీరోయిన్ల పేర్లని ప్రకటించాలని ముందుగా అనుకున్నారు. అయితే కథ ఇంకా ఫైనల్ కాకపోవడంతో హీరోయిన్ల ప్రకటన వాయిదా పడింది. అఖండ ఫైనల్ స్టేజ్‌కు వచ్చిన వెంటనే ఈ సినిమాను పట్టాలెక్కించేయాలని దర్శకుడు గోపీచంద్ ప్లాన్ చేస్తున్నారు.
ఒక హీరోయిన్గా నయనతారను బాలయ్య స్వయంగా ఫైనలైజ్ చేసినట్టు తెలుస్తోంది. నయనతార ఇటీవల తెలుగులో నటించేందుకు ఒప్పుకోవడం లేదు. జై సింహాలో నటించినప్పుడు కూడా బాలయ్య స్వయంగా ఫోన్ చేయడం.. ఆయనతో ఉన్న చనువు నేపథ్యంలోనే ఆ సినిమా చేసింది. ఇక ఆమె సైరాలో నటించేందుకు చిత్ర యూనిట్‌ను చాలా ఇబ్బందులు పెట్టిందన్న ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు బాలయ్య స్వయంగా ఫోన్ చేయడంతో ఈ సినిమాకు ఓకే చెప్పినట్టు టాక్ ?