టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పిన సినిమా సింహాద్రి. ఆది సినిమాతో ఎన్టీఆర్ స్టామినా ఏంటో తెలుగు ప్రజలకు తెలిసింది. ఇక సింహాద్రితో కేవలం 21 సంవత్సరాలకే ఎన్టీఆర్ స్టార్ డమ్ అందుకున్నాడు. సింహాద్రి సినిమా ఏకంగా 55 సెంటర్లలో 175 రోజులు ఆడింది. అప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో ఉన్న అన్ని రికార్డులను ఈ సినిమా చెరిపేసింది. వీఎంసీ ప్రొడక్షన్ బ్యానర్‌పై వి. దొరస్వామి రాజు నిర్మించిన ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించగా… రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు.
అయితే ఈ సినిమాను ముందుగా బాలకృష్ణతో చేయాలని అనుకున్నారట. అయితే బి. గోపాల్ కూడా అదే టైంలో ఓ కథతో రావడంతో ఆ సినిమాకు ఓకే చెప్పిన బాలయ్య సింహాద్రి కథను చేసేందుకు ఇంట్రస్ట్ చూపలేదట. దీంతో రాజమౌళి ఎన్టీఆర్‌ను అప్రోచ్ అవ్వగా.. ఎన్టీఆర్ ఈ సినిమా చేయడం.. బ్లాక్ బస్టర్ అవ్వడం జరిగిపోయాయి. ఇక బాలయ్య – బి. గోపాల్ కాంబోలో వచ్చిన పలనాటి బ్రహ్మనాయుడు సినిమా డిజాస్టర్ అయ్యింది.
బాలయ్య సింహాద్రి చేసేందుకు ఓకే చెప్పి ఉంటే ఈ బ్లాక్ బస్టర్ బాలయ్య ఖాతాలో పడి ఉండేది. అదే టైంలో ఎన్టీఆర్ ఓ బ్లాక్ బస్టర్ మిస్ అయ్యేవాడు. కానీ బాలయ్య ఈ సినిమాను వదులుకుని ఓ డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఎన్టీఆర్ – రాజమౌళి కాంబోలో సింహాద్రికి ముందు స్టూడెంట్ నెంబర్ వన్ వచ్చింది. ఆ తర్వాత సింహాద్రి, 2007లో యమదొంగ వచ్చాయి. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా వస్తోంది.