యువరత్న, నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. బోయపాటి – బాలయ్య కాంబో అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు అఖండ సైతం వీరి కాంబోలో ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడుతుందన్న అంచనాలు ఉన్నాయి. అందుకే అఖండకు అదిరిపోయే బిజినెస్ జరుగుతోంది. సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్‌తో వస్తోన్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.
ఇక అఖండ హిందీ డబ్బింగ్ రైట్స్ ను రు. 14 కోట్లకు అమ్మినట్టు బజ్ వినిపిస్తోంది. బాలయ్య కెరీర్లో ఏ సినిమాకు హిందీ డబ్బింగ్ రైట్స్ ఈ రేటుకు అమ్ముడు పోలేదు. అయితే బోయపాటి మాస్ సినిమాలను హిందీలో డబ్బిగ్ చేసి రిలీజ్ చేస్తుంటే తిరుగులేని రెస్పాన్స్ వస్తోంది. అందుకే ఇప్పుడు అఖండ సినిమాకు సైతం ఈ రేంజ్లో రేటు పలికినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ నిర్మిస్తోంది.