తెలుగులో సునీల్‌రెడ్డి అనే ఓ డిజాస్టర్ డైరెక్టర్ ఉన్నాడన్న విషయం చాలా మందికి గుర్తు ఉండదు. ముందుగా కెమేరామెన్‌గా పనిచేసి ఆ తర్వాత కళ్యాణ్‌రామ్‌తో ఓం త్రీడీ సినిమా చేసిన కళ్యాణ్‌ను నిండా ముంచేశాడు. తర్వాత మెగా మేనళ్లుడు సాయిధరమ్ తేజ్‌తో తిక్క లాంటి ఘోరమైన డిజాస్టర్ చేశాడు. అలాంటి ప్లాప్ డైరెక్టర్‌తో ఓ తెలుగు హీరోయిన్ పీకల్లోతు ప్రేమలో ఉంది. వైజాగ్‌కు చెందిన పూనమ్ బజ్వా మెదటి సినిమాతో హీరోయిన్ అయ్యింది. ఆ తర్వాత నాగార్జున పక్కన బాస్ సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో మెరిసింది.
రెండు డిజాస్టర్ సినిమాలతో అడ్రస్ లేకుండా పోయిన డిజాస్టర్ డైరెక్టర్ సునీల్‌రెడ్డి, ప్లాప్ సినిమాలతో పత్తా లేకుండా పోయిన పూనమ్ బజ్వా ఇద్దరు కొద్ది రోజులుగా ప్రేమలో ఉన్నారు. సునీల్ తిక్క సినిమా చేస్తున్నప్పటి నుంచే వీరు ప్రేమలో ఉన్నారు. ఆ సినిమా వచ్చి కూడా మూడేళ్లు దాటుతోంది. తిక్క ప్లాప్ అయ్యాక వీరు బయట కనపడకపోవడంతో వీరి మధ్య బ్రేకప్ అయ్యిందేమో అనుకున్నారు.
అయితే పూనమ్ సునీల్‌రెడ్డితో ప్రేమను కంటిన్యూ చేస్తూనే ఉంది. త్వరలోనే అతడిని పెళ్లాడబోతోంది. సునీల్‌తో స్విమ్మింగ్ ఫూల్లో జలకాలాటలు ఆడుతోన్న ఓ రొమాంటిక్ ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసి.. మై లైఫ్ మేట్ అంటూ కామెంట్ చేసింది. ఈ ఫొటోకు వాటే రొమాంటిక్ జోడీ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.