Moviesఆ టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ కుల గ‌జ్జి బాగా ఉందా... కులం...

ఆ టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ కుల గ‌జ్జి బాగా ఉందా… కులం కంపులోనే ఛాన్సులా…!

టాలీవుడ్లో ఆయ‌న ఓ అగ్ర ద‌ర్శ‌కుడు. వ‌రుస విజ‌యాల‌తో స్టార్ హీరోలు సైతం అత‌డితో సినిమా చేసేందుకు వెయిట్ చేసే స్థాయికి ఎదిగాడు. ఈ యేడాది ఆరంభంలో కూడా అత‌డు డైరెక్ట్ చేసిన సినిమా ఒక‌టి సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. ఓ అగ్ర హీరోకు సినిమాలు, రాజ‌కీయ స‌ల‌హాలు కూడా ఆ ద‌ర్శ‌కుడే ఇస్తాడ‌న్న పేరు కూడా ఉంది. అయితే అత‌డికి బాగా క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అన్న ప్ర‌చారం ఇండ‌స్ట్రీలో ఇటీవ‌ల త‌ర‌చూ వినిపిస్తోంది. ఫ్యామిలీ ఎంట‌ర్టైనర్లు, క్లాస్‌, మాస్ సినిమాలు చేసే ఆ ద‌ర్శ‌కుడు ఓ స్టార్ హీరోతో సినిమా స్టార్ట్ చేశాడు.

 

అయితే ఆ హీరో చేస్తోన్న మ‌రో క్రేజీ ప్రాజెక్టు ఆల‌స్యం అయ్యేలా ఉండడంతో ఈ గ్యాప్‌లో మ‌రో యంగ్ హీరోతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా మ‌ళ‌యాళ ముద్దుగుమ్మ‌ను రిక‌మెండ్ చేశాడ‌ట‌.  ఆ హీరోయిన్‌కు ఇటీవ‌ల హిట్లు లేవు. అయితే స‌ద‌రు డైరెక్ట‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో గ‌తంలో వ‌చ్చిన ఓ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా చేసిన ఆమెను ఇప్పుడు మ‌ళ్లీ తీసుకోవ‌డం వెన‌క వారిద్ద‌రికి ఒకే కులం కావ‌డ‌మే కార‌ణం అంటున్నారు.

 

ఇక స‌ద‌రు డైరెక్ట‌ర్ సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు, ఇత‌ర సాంకేతిక నిపుణులు కూడా ఎక్కువుగా త‌న సామాజిక వ‌ర్గం వారు ఉండేలా ఆ ద‌ర్శ‌కుడు చూసుకుంటాడ‌ని.. మిగిలిన కులాల వాళ్ల‌కు త‌క్కువ ఛాన్సులు ఇస్తాడ‌న్న విమ‌ర్శ‌లు కూడా ఆ స్టార్ డైరెక్ట‌ర్‌పై ఉన్నాయి. టాలీవుడ్‌లో రెండు కులాల డామినేష‌న్ ఉంద‌న్న చ‌ర్చ ఎప్ప‌టి నుంచో ఉంది. అయితే ఆ రెండు కులాల‌కు చెంద‌ని ఈ టాప్ డైరెక్ట‌ర్‌కు అంత‌కు మించిన కుల పిచ్చి ఉందంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news