యువరత్న నందమూరి బాలకృష్ణ – యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కాంబోలో రూపొందుతున్న మూడో సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ రెండు సినిమాలు హిట్ అయ్యాయి. ఇప్పుడు మూడో సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లోనే భారీ అంచనాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ కాంబోలో వచ్చే మూడో సినిమా హ్యాట్రిక్ కొడుతుందనే అంటున్నారు.
ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ బాలయ్య అభిమానులకే కాకుండా, యాక్షన్ ప్రియులకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఇక ఈ సినిమాలో బాలయ్య పక్కన హీరోయిన్గా ఎవరు ? నటిస్తున్నారన్న దానిపై ఆరేడు నెలలుగా పెద్ద చర్చలే నడుస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఓ మళయాళ హీరోయిన్ పేరు తెరమీదకు వచ్చింది. అధికారిక ప్రకటన రాలేదు.
ఇప్పుడు లేటెస్ట్ టాక్ ప్రకారం బోయపాటి మళ్లీ అంజలితో చర్చలు స్టార్ట్ చేశాడట. వీరిద్దరు గతంలోనే డిక్టేటర్ సినిమాలో నటించారు. అయితే ఇప్పుడు మరోసారి బాలయ్యతో జోడీ కట్టేందుకు ఆమె రెడీ అయ్యిందనే అంటున్నారు. అయితే రెండో హీరోయిన్ పాత్ర కూడా ఉందట.. ఇందుకోసం బోయపాటి ఎవరిని తీసుకుంటాడో ? అన్నది కూడా ప్రస్తుతానికి సస్పెన్సే..!