ఎస్ ఈ టైటిల్ నిజమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మెగాస్టార్ చిరంజీవి సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడం ఏ డైరెక్టర్‌కు అయినా లక్కీ ఛాన్సే. అయితే ఓ డైరెక్టర్ మాత్రం చిరంజీవి సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చినా తప్పుకున్నారట. ఆ డైరెక్టర్ ఎవరో కాదు వివి. వినాయక్. కోలీవుడ్ హిట్ మూవీ లూసీఫర్ రీమేక్‌లో చిరంజీవి నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రీమేక్ బాధ్యతలను మెగాస్టార్ స్వయంగా వినాయక్‌కు అప్పగించాడు. అయితే ఇప్పుడు మెగా కాంపౌండ్ ఏం తర్జన భర్జనలు పడిందో కాని.. ఈ సినిమాను వినాయక్ పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తాడా ? అన్న సందేహంతో ఉందట.
అటు వినాయక్ కూడా చిరు, మెగా కాంపౌండ్ పదే పదే సూచనలు చేస్తుండడంతో పాటు కథ, కథనాలను మారుస్తుండడంతో తాను సైతం ఈ సినిమా డైరెక్షన్ బాధ్యతల నుంచి తప్పుకుంటేనే మంచిదన్న నిర్ణయానికి వచ్చాడంటున్నారు. చిరు మాత్రం ఈ రీమేక్‌ను ఖచ్చితంగా చేయాలనే పట్టుదలతో ఉన్నాడట. వినాయక్ కాని పక్షంలో మరో డైరెక్టరోతో అయినా సినిమా చేసేద్దాం అని డిసైడ్ అయిన చిరు ఈ ప్రాజెక్టు మార్పులు, చేర్పులను మెహర్ రమేష్, బాబిలతో చేస్తున్నాడట.
వారిద్దరు లూసీఫర్ రీమేక్‌లో మార్పులు, సలహాలు చిరంజీవికి ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇక వేదాళం రీమేక్‌కు మెహర్ రమేష్ డైరెక్టర్‌గా కన్ఫార్మ్ అయ్యాడంటున్నారు.