స‌ర్కారు వారి పాటపై క్రేజీ అప్‌డేట్‌.. మ‌హేష్ ఫ్యాన్స్‌కు ర‌చ్చ రంబోలాయే..!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు – మైత్రీ మూవీస్ వారి స‌ర్కారు వారి పాట సినిమాపై ఫ్యీజులు ఎగిరిపోయే అప్‌డేట్ వ‌చ్చేసింది. తాజాగా ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌డంతో పాటు రిలీజ్ టైం కూడా ఫిక్స్ అయిపోయింది. కూక‌ట్‌ప‌ల్లి వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో జ‌రిగిన పూజా కార్య‌క్ర‌మంలో నిర్మాత‌లు, మ‌హేష్ భార్య న‌మ్ర‌త‌తో పాటు ద‌ర్శ‌కుడు ప‌ర‌శురాం పాల్గొన్నారు. ఈ రోజు మంచి ముహూర్తం ఉండ‌డంతో పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన‌ట్టు తెలుస్తోంది.

Sarkaru Vaari Paata to be shot in a single stretch

ముందుగా అమెరికాలో ఫ‌స్ట్ షెడ్యూల్ ఫినిష్ చేసి ఆ త‌ర్వాత హైద‌రాబాద్‌లో షూటింగ్ చేయాల‌నుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్లాన్ రివ‌ర్స్ అయ్యింది. ముందుగా హైద‌రాబాద్ షెడ్యూల్ ఫినిష్ చేసి.. ఆ త‌ర్వాత అమెరికా షెడ్యూల్ ప్రారంభించే ఏర్పాట్లు చేసుకున్నారు. జ‌న‌వ‌రిలో సంక్రాంతి త‌ర్వాత హైద‌రాబాద్ షెడ్యూల్ ప్రారంభించి.. ఆ త‌ర్వాత అమెరికా షెడ్యూల్ స్టార్ట్ చేస్తారు.

Everything We Know About Mahesh Babu's Sarkaru Vaari Paata

ఇక మార్చి నుంచి అమెరికా షెడ్యూల్ ఉంటుంది. ఈ సినిమాను వ‌చ్చే యేడాది ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో బ్యాంకు రుణాల ఎగ‌వేత‌లు, అవినీతి, అక్ర‌మాల వంటి పాయంట్ల‌తో క‌థ ఉంటుంద‌ని తెలుస్తోంది. గీత‌గోవిందం తర్వాత ద‌ర్శ‌కుడు ప‌ర‌శురాం లాంగ్ గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేస్తున్నాడు.