మైనే ప్యార్ కియా ( తెలుగులో ప్రేమ పావురాలు ) సినిమాతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులనే ఒక ఊపు ఊపేసింది భాగ్య శ్రీ. అందుకనే ఓ సినిమాలో పాటలో కూడా దేశాన్నే ఊపేసిన భాగ్య శ్రీ అన్న చరణం కూడా ఆమెపై ఉంది. సల్మాన్‌ఖాన్ నటించిన మైనే ప్యార్ కియాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్న ఆమె దానిని కంటిన్యూ చేయలేక తర్వాత తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యింది. చాలా యేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు ప్రభాస్ ఫాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్‌తో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది.
ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకుంది. ప్రేమ పావురాలు సినిమా చూశాక తానేంటే ప్రభాస్ క్రష్ ఫీలైన విషయాన్ని ప్రభాసే చెప్పాడంటోంది భాగ్య శ్రీ. రాధే శ్యామ్‌లో భాగ్య శ్రీ ప్రభాస్‌కు తల్లిగా నటిస్తోంది. ఈ సినిమాలో భాగ్య శ్రీ ఎంట్రీ ఇవ్వడంతోనే సినిమాకు తిరుగులేని క్రేజ్ వచ్చేసింది. ఇక ప్రేమ పావురాలు సినిమాలో నటించడం తాను ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని చెప్పిన భాగ్య శ్రీ ఆ సినిమా కథను తన కోసం ఏడు సార్లు మార్చారని.. ఎనిమిదో సారి తిరస్కరించలేక ఒప్పుకున్నానని చెప్పింది.
ఇక తనకు ఇప్పుడిప్పుడే తెలుగు కొంచెం కొంచెం అర్థమవుతోందని… రాధే శ్యామ్ యూనిట్ తనను ఎంతో బాగా చూసుకుంటున్నారని… హైదరాబాద్ మిఠాయిలు తనకు గిఫ్ట్‌గా ఇచ్చారని చెపుతోంది. ఏదేమైనా నాడు ప్రేమ పావురాలుతో దేశాన్ని ఊపేసిన భాగ్య శ్రీ క్రేజ్ రాధే శ్యామ్‌కు బాగానే కలిసొచ్చేలా ఉంది.