మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వరుస పెట్టి పలు ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు. ఆచార్య అయిన వెంటనే మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్, ఆ వెంటనే మళయాళ్ సినిమా లూసీఫర్ రీమేక్‌లో కూడా నటించాడు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కే లూసీఫర్ రీమేక్‌కు వివి. వినాయక్ దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమా కథపై వినాయక్, ఆకుల శివ కలిసి స్క్రిఫ్ట్ వర్క్ పూర్తి చేశారని సమాచారం.
రామ్‌చరణ్, ఎన్వీ. ప్రసాద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. వాస్తవంగా మళయాళ లూసీఫర్‌లో హీరో మిడిల్ ఏజ్ క్యారెక్టర్‌లో కనిపిస్తాడు. ఆ క్యారెక్టర్‌కు జోడీగా హీరోయిన్ కూడా ఉండదు. అయితే తెలుగు రీమేక్‌లో మాత్రం ఓ భార్య క్యారెక్టర్‌తో పాటు హీరోను ఢీ కొట్టే మరో లేడీ క్యారెక్టర్‌ను కూడా డిజైన్ చేశారట. అక్కడ హీరోయిన్లు లేరు.. సాంగ్స్ కూడా లేవు.
తెలుగులో మాత్రం చిరంజీవి ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు మార్పులు చేశారంటున్నారు. ఇందుకోసం నయనతారను చిరు భార్య రోల్, త్రిషను చిరును ఢీ కొట్టే లేడీ లీడర్ రోల్ కోసం సంప్రదించారంటున్నారు. నయనతార, త్రిష కూడా చిరు పక్కన ఉంటే ఫ్యాన్స్‌కు మామూలు సంతోషం కాదనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో హీరోకు సమానంగా ఉండే రెండు పాత్రల కోసం అన్వేషణ జరుగుతోంది.