Newsగూగుల్ రూల్స్ మారిపోతున్నాయ్‌... కొత్తవి ఇవే...

గూగుల్ రూల్స్ మారిపోతున్నాయ్‌… కొత్తవి ఇవే…

ప్ర‌పంచ వ్యాప్తంగా వినియోగ‌దారుల సౌల‌భ్యం కోసం ఎప్ప‌టిక‌ప్పుడు మార్పులతో వ‌స్తోన్న గూగుల్ ఇప్పుడు వ‌చ్చే నెల నుంచి మ‌రిన్ని స‌రికొత్త మార్పుల‌తో అందుబాటులోకి రానుంది. వినియోగ‌దారుల కోసం వారి అక్కౌంట్ల‌లో జీ మెయిల్‌, గూగుల్ డ్రైవ్‌ల‌లో అన్ యాక్టివ్‌గా, ప‌రిమితికి మించి ఉన్న స‌మాచారం కోసం గూగుల్ న‌యా పాల‌సీతో రానుంది. వ‌చ్చే యేడాది జూన్ 1 నుంచి ఈ కొత్త నిబంధ‌న‌లు అమల్లోకి రానున్నాయి. గూగుల్ కొత్త పాల‌సీ ప్ర‌కారం డాక్స్, షీట్లు, సైడ్లు, డ్రాయింగ్‌లు, జూమ్ బోర్డు ఫైల్స్ అన్ని కూడా మ‌రింత మెరుగ్గా ఉంటాయ‌ని గూగుల్ తెలిపింది.

వ‌చ్చే జూన్ 1 నుంచి వినియోగ‌దారులు ఒక‌టి లేదా అంత‌కు మించిన సేవ‌ల్లో రెండు సంవ‌త్స‌రాల పాటు అక్కౌంట్‌ను యాక్టివ్‌గా ఉంచ‌క‌పోతే ఆ అక్కౌంట్‌లో క్రియార‌హితంగా ఉన్న స‌మాచారం అంతా గూగుల్ ఆటోమేటిక్‌గా తొల‌గిస్తుంది. స్టోరేజ్ ప‌రిమితి కూడా రెండేళ్లు దాటితే అందులో డ్రైవ్‌, ఫొటోల్లో ఉన్న కంటెంట్‌ను సైతం తొలగిస్తామ‌ని గూగుల్ పేర్కొంది. వినియోగ‌దారులు వారి ఖాతాల‌ను యాక్టివ్‌గా ఉంచేందుకు వారి జీ మెయిల్‌, డ్రైవ్ ఫొటోల‌ను చూస్తూ ఉండాల‌ని కూడా స్ప‌ష్టం చేసింది

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news