తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభానికి ముందు అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొద్ది సేపట్లో పోలింగ్ ప్రారంభమవుతుందనగా టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో టీఆర్ఎస్ ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు. బీజేపీ కార్యకర్తలు అందరూ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ బస చేస్తోన్న హోటల్‌కు వెళ్లి అకకడ క్రాంతిపై దాడి చేసేందుకు ప్రయత్నించగా ఎమ్మెల్యే ఆ దాటిని ప్రతిఘటించారు.
అటు టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా దాడికి ప్రయత్నించడంతో బీజేపీ కార్యకర్తలకు కూడా గాయాలు అయ్యాయి. ఈ దాడి నేపథ్యంలో తప్పు టీఆర్ఎస్ కార్యకర్తలదే అని బీజేపీ… బీజేపీ వాళ్లదే అని టీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ దాడిపై ఎమ్మెల్యే క్రాంతి మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలు కావాలనే రెచ్చ గొట్టారని.. ఈ ఘటనపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.