ఒక హీరోయిన్ కారణంగా మెగా స్టార్ సినిమా ఆగిపోయింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు అందాల నటి దివంగత శ్రీదేవి. అవును, కెరీర్ స్టాటింగ్‌లో అణిగిమణిగి ఉన్న శ్రీదేవి.. ఎప్పుడైతే టాలీవుడ్‌తో పాటుగా బాలీవుడ్‌లోనూ స్టార్ హీరోయిన్‌గా మారిందో అప్పటి నుంచి దర్శక, నిర్మాతలకు చుక్కలు చూపించేదట.
ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వాలని, తన పాత్ర హీరోతో సమానంగా ఉండాలని ఇలా రకరకాల కండీషన్స్ పెడుతూ అహంకారం చూపించేవారట. ఇక అప్పుట్లో శ్రీదేవి ఆహంకారం వల్లే చిరంజీవి రెండు సినిమాలు కూడా ఆగిపోయాయి. ఆ సినిమాలు ఏవో కాదు.. వజ్రాల దొంగ మరియు కొండవీటి దొంగ. అదేంటి కొండవీటి దొంగ విడుదలైంది కదా అని మీకు సందేహం రావొచ్చు. నిజానికి `కొండవీటి దొంగ` తెర వెనుక పెద్ద కథే జరిగింది.
మొదట కొండవీటి దొంగలో హీరోయిన్‌గా చేయాలని దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి శ్రీదేవిని సంప్రదించారట. అయితే ఆ సినిమాకి `కొండవీటి రాణి కొండవీటి రాజా` అనే టైటిల్ పెట్టాలని మరియు తన పాత్ర ప్రాధాన్యత హీరోతో సమానంగా ఉండాలని కండీషన్స్ పెట్టారట శ్రీదేవి. దీంతో చిరుకు చిరెత్తుకొచ్చి.. శ్రీదేవితో సినిమా చేయనని తెగేసి చెప్పారట. ఈ క్రమంలోనే ఈ సినిమా రెండేళ్లు ఆగిపోగా.. చివరకు రాధ, విజయశాంతి హీరోయిన్లుగా 1990 లో విడుదలై సూపర్ హిట్ అందుకుంది.