మీటు ఉద్యమం పుణ్యమా అని ఎవరికి వారు తమపై జరిగిన లైంగీక వేధింపులను నిర్మొహమాటంగా ప్రస్తావిస్తున్నారు. సిగ్గు విడిచి తమపై జరిగిన దారుణ అకృత్యాలను ఓపెన్‌గా చెప్పేస్తున్నారు. వీరికి పలువురి నుంచి సోషల్ మీడియాలో బలమైన మద్దతు ఉండడంతో ఇక ఎవ్వరు వెనుదిరిగి చూసుకునే ప్రశక్తే ఉండడం లేదు. ఈ లిస్టులో టాప్ హీరోయిన్ల నుంచి సింగర్ల వరకు చాలా మంది ధైర్యంగా ముందుకు వస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో బాలీవుడ్ సింగర్ నేహా బాసిన్ కూడా చేరారు.
తనపై చిన్నప్పుడు జరిగిన లైంగీక దాడి గురించి ఆమె వెల్లడించారు. తనకు పదేళ్ల వయస్సు ఉన్నప్పుడు తల్లితో కలిసి హరిద్వార్ దేవుడు దర్శనానికి వెళ్లిందట. ఆ సమయంలో ఆమె తల్లి దూరంగా ఉండగా.. క్యూలో ఉన్న ఓ వ్యక్తి ఆమెను చెప్పుకోలేని చోట వేలుతో పొడిచాడట. ఆ తర్వాత కొద్ది రోజులకు మరో వ్యక్తి తన ఎద భాగాన్ని పట్టుకుని చాలా అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె వాపోయింది. దీంతో నేహకు మద్దతుగా పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా చెప్పిందని ప్రశంసిస్తున్నారు.