బుల్లితెర నుంచి బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది హిమజ. గతేడాది బిగ్‌బాస్ హౌస్‌లో హిమజ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు బిగ్‌బాస్ క్రేజ్‌తో ఆమె ఏకంగా వెండితెరను ఏలేందుకు రెడీ అవుతోంది. హిమజ నటిస్తోన్న హర్రర్ మూవీ జ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కూడా ఆకట్టుకుంది. తాజాగా ఆమె బెంజ్ కారు కొని సోషల్ మీడియాలో ఆ ఫొటో పోస్ట్ చేసింది. ఆమె బెంజ్ కారు కొన్నప్పటి నుంచి సోషల్ మీడియాలో నెటిజన్లు నీకు అంత డబ్బు ఎక్కడిది ? కారు ఎలా కొన్నావంటూ రకరకాల ప్రశ్నలతో ఆమెను గుచ్చుతున్నారు.
దీంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చేసినట్టుంది. తాను స్కూల్ టీచర్‌గా పని చేసినప్పటి నుంచే ఒక్కో రూపాయి దాచుకుంటూ కష్టపడుతూ ఇబ్బందులు పడుతూ కారు కొన్నానని చెప్పారు. నటిగా తాను బిజీగా ఉండడంతో బెంజ్ కంపెనీ వాళ్లే తనకు జీరో కాస్ట్ ఈఎంఐతో కారు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని హిమజ చెప్పింది. నెలకు రు. 50 వేల ఈఎంఐతో తాను బెంజ్ కారు కొనుక్కున్నానని చెప్పింది.
ప్రతి నెలా 4వ తేదీన తాను తన కారు ఈఎంఐ చెల్లిస్తున్నానని… తన కారుపై విమర్శలు చేసే వాళ్లు తన ఈఎంఐ చెల్లిస్తారా అంటూ ఆమె భగ్గుమంది. తన కష్టంతో కారు కొనుక్కుంటే సోషల్ మీడియాలో ఈ ట్రోలింగ్ ఏంటని హిమజ మామూలుగా ఏసుకోలేదు.