అప్పట్లో అతిలోక సుందరి శ్రీదేవి – బోనీకపూర్ ఎఫైర్ పెద్ద సంచలనం. సౌత్‌లో ప్రారంభమై నార్త్ వరకు శ్రీదేవికి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఆమె బాలీవుడ్‌లో అడుగుపెట్టాక ముందుగా మిథున్ చక్రవర్తితో ఎఫైర్ పెట్టుకుందన్న వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఏమైందో గాని ఆమె బోనీని పెళ్లి చేసుకోకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత వాళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉంటే బోనీకి ముందే మోనా కపూర్‌తో పెళ్లవ్వడంతో పాటు ఆ దంపతులకు అర్జున్ కపూర్.. అన్షులా కపూర్ ఉన్నారు.
దివంగత మోనాకపూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీదేవి – బోనీ ఎఫైర్ వల్ల తనతో పాటు తన పిల్లలు ఎంతో నరకం అనుభవించారని చెప్పింది. స్కూల్లో తన పిల్లలను తోటి ఫ్రెండ్స్ శ్రీదేవి – బోని ఎఫైర్ గురించి హేళనగా మాట్లాడేవారని ఆమె చెప్పింది. రెండో సంబంధం గురించి తాను పుస్తకాల్లో చదివాను.. విన్నానని.. అయితే అది చివరకు తన జీవితంలోనే ఉంటుందని ఊహించలేకపోయానని మోనా కపూర్ ఆవేదనతో చెప్పుకొచ్చింది.
స్కూల్లో తన పిల్లలకు తోటి స్నేహితుల నుంచి వేధింపులు ఉంటే.. ఇటు సంఘంతో కొందరు తనను కూడా ఎగతాళిగా మాట్లాడేవారని ఆమె చెప్పింది. చాలా మంది తనతో మీరు ఎందుకు బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేయరు.. అప్పుడు అందంగా ఉంటే బోనీ మిమ్మలను వదిలేసే వాడు కాదుగా… ఆయనకు శ్రీదేవి అవసరం వచ్చేది కాదుగా అని మాట్లాడేవారంటూ ఆమె వాపోయింది.