తెలుగు ప్రేక్షకులకు నటి కృష్ణవేణి అంటే పెద్దగా ఈ పేరు గుర్తు ఉండదు. అయితే ఆమె నటించిన సినిమాల్లో సన్నివేశాలు మాత్రం అలా మదిలో ఉండిపోతాయి. ఆమె ఫేస్ చూశారంటే ఆమెను ఠక్కున గుర్తు పట్టేస్తారు. భద్ర సినిమాలో కృష్ణవేణి – గుండు హనుమంతరావు మధ్య వచ్చిన కామెడీ సీన్లు ఇప్పటకీ ప్రేక్షకులకు గుర్తుండి పోతాయి. కృష్ణవేణి సినిమాల్లోకి రాకముందు ఎన్నో కష్టాలు పడ్డారట.
ఆమెకు 10 ఏళ్లకే పెళ్లయిపోయింది. తల్లిదండ్రులు ఆమెకు చిన్న వయస్సులోనే బలవంతంగా పెళ్లి చేయడంతో ఆమె 13 ఏళ్లకే ఓ బిడ్డకు తల్లి అయ్యింది. ఆ తర్వాత భర్తతో విబేధాలు రావడంతో విడాకులు తీసుకున్న ఆమె తెలిసిన వారి ద్వారా కుటుంబ పోషణ కోసం సీరియల్స్‌లో నటించింది. ఆ తర్వాత ఆమెకు సినిమాల్లో హీరోయిన్గా ఛాన్సులు వచ్చాయి. ఆమె హీరోయిన్గా చేసిన రెండు సినిమాల్లో ఒక సినిమా రిలీజ్ కాలేదు.. మరో సినిమా ప్లాప్ అవ్వడంతో ఆమెకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి.
ఆ తర్వాత ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆ పాత్రలు కూడా రాకపోవడంతో చివరకు అమెరికాలో ఓ వృద్ధుడికి కొన్ని రోజుల పాటు కేర్ టేకర్‌గా కూడా పని చేసింది. ఆ తర్వాత ఆమె సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోగా.. ఆ వ్యక్తి కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆమెకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఆమె మళ్లీ సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా ఉంది.
కృష్ణవేణికి తెలుగు పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అయిన రజిత, రాగిణి సమీప బంధువులే అవుతారు.