1990వ దశకంలో నాటి స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా తిరుగులేని క్రేజ్ దక్కించుకుంది రమ్యకృష్ణ. తెలుగు, తమిళ్ భాషల్లో ఎంతో బిజీగా ఉన్న రమ్య ఆ తర్వాత టాప్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయింది. బాహుబలిలో శివగామి క్యారెక్టర్‌తో ఆమె నేషనల్ నటిగా మారిపోయింది. సెకండ్ ఇన్సింగ్స్‌లో రమ్య దూకుడుకు బ్రేకులు వేయడమే కష్టంగా ఉంది. బాహుబలి తర్వాత ఆమె కోలీవుడ్, టాలీవుడ్‌లోనే అత్యధిక పారితోషకం తీసుకుంటోన్న సహాయనటిగా ప్రచారం జరుగుతోంది.
ఆమె పారితోషకం ఒక్క రోజుకు రు. 8 – 10 లక్షలు డిమాండ్ చేస్తోందట. ఇక సినిమా కోసం బల్క్‌గా డేట్లు ఇవ్వాలంటే మాత్రం ఆమె పారితోషకం కోట్లలోనే డిమాండ్ చేస్తోందట. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ వేళ కాస్త రెమ్యునరేషన్ తగ్గించుకోమని నిర్మాతలు, దర్శకులు ఆమెను రిక్వెస్ట్ చేస్తున్నా ఆమె మాత్రం తాను అడిగినంత ఇస్తేనే సినిమా చేస్తానని చెపుతోందట.
తాజాగా రమ్య విజయ్ దేవరకొండ తో పూరి తెరకెక్కిస్తున్న ఒక సినిమాలో నటిస్తుండగా.. మరో వైపు సాయి ధరమ్ తేజ్ దేవాకట్టా కాంబోలో వస్తోన్న సినిమాలో కూడా నటిస్తోంది. అలాగే కొన్ని వెబ్ సీరిస్‌లలో కూడా నటిస్తోంది. ఏదేమైనా ఆమెను సినిమాలో నటింపజేసేందుకు ఒప్పించడం దర్శక నిర్మాతలకు తలకు మించిన భారంగా మారిందట. రేటు విషయంలో ఆమె ఏ మాత్రం వెనక్కు తగ్గకపోవడంతో ఆమె రేటును భరించే వారు ఆమెను సినిమాల్లో పెట్టుకుంటోన్న పరిస్థితి ఉందంటున్నారు.