కరోనా టైంలో చాలా మంది స్టార్ హీరోల పెళ్లిళ్లు సైతం చాలా సింపుల్‌గా గప్‌చుప్‌గా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంత పెద్ద గొప్ప హీరో, హీరోయిన్లు అయినా కూడా 50 – 100 మంది సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు. టాలీవుడ్లో రానా, నితిన్, నిఖిల్, దిల్ రాజు రెండో పెళ్లి అన్ని కూడా కరోనా వేళ పెద్ద హడావిడి లేకుండానే జరిగిపోయాయి. ఇదిలా ఉంటే ఓ టాలీవుడ్ హీరోయిన్ సైతం కరోనా వేళ ఎవ్వరికి తెలియకుండా గప్‌చుప్‌గా పెళ్లి చేసుకుంది.
అయితే ఆమె పెళ్లి ఆగస్టులోనే అవ్వగా ఈ విషయం ఎవ్వరికి తెలియదు. తాజాగా ఆ హీరోయిన్ తన భర్త ఇతడే అని సోషల్ మీడియాలో ఫొటో పెట్టే వరకు ఎవ్వరికి తెలియదు. తెలుగులో తనీష్ పక్కన మేము వయసుకు వచ్చాం సినిమాలో హీరోయిన్గా నటించింది నీతి టేలర్. ఆ తర్వాత ఆమె పెళ్లి పుస్తకం సినిమాలో కూడా నటించింది. సినిమా హీరోయిన్గా సక్సెస్ కాకపోవడంతో ఆ తర్వాత ఆమె బుల్లితెరపై పాపులర్ నటి అయ్యింది.
ఈ క్రమంలోనే ఆమె ఆగస్టు 13న కోవిడ్ నిబంధనల మధ్య తన ప్రియుడు పరీక్షిత్‌ను పెళ్లి చేసుకున్నట్టు తాజాగా ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఏదేమైనా నీతి టేలర్ మొత్తానికి ఎవ్వరికి చెప్పకుండానే ఓ ఇంటిది అయిపోయింది. ఈ విషయం తెలిశాక సినీ వర్గాలు షాక్‌లో ఉన్నాయి. ఇక కరోనా తగ్గిన తర్వాత అందరికీ రిసెప్షన్ ఇస్తానని నీతి చెప్పుకొచ్చింది.