ఆ హీరోయిన్ మూడో భ‌ర్త‌ను వ‌దిలేయ‌డానికి కార‌ణం ఇదే…!

కోలీవుడ్‌లో ఇటీవ‌ల వ‌రుస వివాదాల‌కు కేరాఫ్‌గా మారింది వ‌నితా విజ‌య్‌కుమార్‌. సీనియ‌ర్ న‌టులు మంజుల – విజ‌య్ కుమార్ దంప‌తుల కుమార్తె అయిన వ‌నిత తెలుగులో దేవి సినిమాలో కూడా న‌టించింది. అయితే వ‌రుస పెళ్లిళ్ల‌తో ఆమె న్యూస్‌లో ఉంటోంది. ఇప్ప‌టికే రెండు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు పిల్ల‌ల‌కు త‌ల్లి అయిన ఆమె గ‌త లాక్‌డౌన్‌లో పీట‌ర్ పాల్ అనే వ్య‌క్తిని మూడో పెళ్లి చేసుకుని మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది.

 

తాజాగా ఆమె త‌న మూడో భ‌ర్త‌ను కూడా వ‌దిలేసింద‌న్న టాక్ నిన్న‌టి నుంచి వినిపిస్తోంది. 40 ఏళ్ల వ‌య‌స్సులో ఆమె చేసుకున్న పెళ్లి మూన్నాళ్ల ముచ్చ‌ట‌గానే మిగిలిపోయింద‌ని కూడా ప‌లువురు సెటైర్లు వేస్తున్నారు. ఇక పీట‌ర్ పాల్ భార్య త‌న భ‌ర్త త‌న‌కు విడాకులు ఇవ్వ‌కుండానే వ‌నిత‌ను పెళ్లాడాడంటూ కూడా విమ‌ర్శ‌లు చేయ‌డంతో ఈ వివాహం మ‌రింత ర‌చ్చ‌కెక్కింది.

 

అయితే ఇప్పుడు పీట‌ర్ పాల్ నుంచి వనిత విడిపోవ‌డానికి కార‌ణం వారిద్ద‌రి మ‌ధ్య గొడ‌వే అన్న గుస‌గుస‌లు వ‌స్తున్నాయి. వీరిద్ద‌రు గోవా ట్రిప్‌న‌కు వెళ్ల‌గా.. ఈ ట్రిప్‌లో మ‌ద్యం తాగిన పీట‌ర్ వ‌నిత‌ను కొట్టాడ‌ట‌. దీంతో చెన్నైకు రాగానే వ‌నిత పీట‌ర్‌ను ఇంటి నుంచి త‌రిమి వేసిందంటున్నారు. అయితే దీనిపై వ‌నిత క్లారిటీ ఇస్తూ ప‌లు ట్వీట్లు పెట్టినా అందులో ఆమె వేదాంతం చూస్తే ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింద‌నే తెలుస్తోంది.