ఒక్కోసారి ఒక్కొక్కరి జీవితాలు తల్లకిందులు అవుతుంటాయి. బళ్లు ఓడలు అవ్వడం, ఓడలు బళ్లు అవ్వడం సహజంగానే జరుగుతుంటుంది. ఈ క్రమంలోనే ప్రేమ్ ఇష్క్ కాదల్ లాంటి ప్రేమకథతో ప్రేక్షకుల మదిలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు దర్శకుడు పవన్ సాధినేని. తొలి సినిమా కావడంతో అతడికి పెద్దగా పేరున్న ఆర్టిస్టులు దొరకలేదు. రెండో సినిమా సావిత్రికి నారా రోహిత్‌ను పట్టుకున్నాడు. ఈ సినిమా రిలీజ్‌కు ముందు మంచి అంచనాలతో విడుదల అయినా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమంది.
ఇప్పుడు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత చాలా కష్టం మీద బెల్లంకొండ గణేష్ డెబ్యూ మూవీతో ఓ అవకాశం దక్కించుకున్నాడు. మరి ఈ సినిమా హిట్ అయితేనే అతడి కెరీర్‌కు ఊపు వస్తుంది. లేకపోతే అతడిని జనాలు గుర్తు పెట్టుకోవడం కూడా కష్టమే. ఇదిలా ఉంటే హరికృష్ణ – కళ్యాణ్‌రామ్ కాంబోలో ఓ మల్టీస్టారర్ కోసం పవన్ ఓ కథ రెడీ చేసుకున్నాడట. ఈ కథ ఎన్టీఆర్‌కు కూడా బాగా నచ్చిందట.
ఇది ఫాంటసీ మల్టీస్టారర్‌గా తెరకెక్కించాలనుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కాల్సిన టైంలోనే హరికృష్ణ మృతి చెందడంతో పవన్ కెరీర్ పూర్తిగా తల్లకిందులు అయిపోయింది. ఆ తర్వాత మనోడు ఛాన్సుల కోసం ఎన్నో ఇబ్బందులు పడడంతో పాటు చివరకు నాలుగేళ్లు వెయిట్ చేస్తే గాని సినిమా ఛాన్స్ రాలేదు.