తెలుగు బుల్లితెర పాపులర్ రియాల్టీ షో నుంచి ఈ వారం ఎలిమినేట్ అయిన జోర్దార్ సుజాత బయటకు వచ్చాక పలు టీవీ ఛానెల్స్‌కు, యూట్యూబ్ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ క్రమంలోనే ఆమె షో గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. ఇప్పటికే బయటకు వచ్చిన కంటెస్టెంట్లు సూర్య కిరణ్, కరాటే కళ్యాణి, దేవి నాగవల్లి షోపై రకరకాల ఆరోపణలు చేయడంతో పాటు ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సుజాత సైతం అనేక సందేహాలకు తావిచ్చే వ్యాఖ్యలు చేసింది.
ఆమె ఎలిమినేషన్ వెనక ప్రధానంగా రెండు కారణాలు చెపుతున్నారు. ఒకటి ఆమె నాగార్జునను సర్ అని పిలవకుండా బిట్టు అని పిలవడం నాగ్ అభిమానులకు నచ్చకపోవడంతో ఆమెను త్వరగా బయటకు పంపేలా ఓటింగ్ వేశారని ఒక టాక్ ఉంది. ఇక ఆమె నవ్వు, ఓవర్ యాక్షన్ కూడా ప్రేక్షకులకు నచ్చలేదన్న చర్చలు నడుస్తున్నాయి.
ఈ క్రమంలోనే సుజాత మాట్లాడుతూ తాను బిగ్‌బాస్‌కు వెళ్లినప్పుడు నాగార్జున అంటే ఇష్టమా ? అని అడిగారని.. తాను అవును అని చెప్పడంతో పాటు మనంలో బిట్టు పాత్ర చాలా ఇష్టం అని చెప్పానని.. అప్పుడు బిగ్‌బాస్ నిర్వాహకులే నాగార్జును బిట్టు అని పిలవడం ఇష్టమేనా అని అన్నారని.. తాను అలా పిలవడంతో ఆయన కూడా సంతోషించారని సుజాత చెప్పింది.
ఒకవేళ నాగార్జున అభిమానుల మనస్సు బాధపడి ఉంటే తాను క్షమాపణ చెపుతున్నట్టు సుజాత చెప్పింది. ఏదేమైనా షో నిర్వాహకులే తనను అలా పిలవమన్నారని చెప్పడంతో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవడంతో పాటు షోలో కొంత స్క్రిఫ్ట్ ప్రకారం నడుస్తుందా ? అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు.