ఏడు నెలల గ్యాప్ తర్వాత ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఎట్టకేలకు ప్రారంభం కావడంతో అభిమానులు అందరూ కాస్త హ్యాపీగా ఉన్నారు అనుకున్న టైంలో మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌కు మళ్లీ బ్రేక్ పడింది. ఈ సినిమా యూనిట్ అక్టోబర్ 22న కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ లుక్‌ను పరిచయం చేయనున్నట్టు ప్రకటించింది. ఓ వైపు నందమూరి అభిమానులు ఈ టీజర్ న్యూస్ సంబరాల్లో ఉండగానే తాజా న్యూస్‌తో మళ్లీ కలవర పడుతున్నారు.
ఆర్ ఆర్ ఆర్ వర్గాల నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్‌కు మళ్లీ బ్రేక్ పడిందని తెలుస్తోంది. అయితే ఈ సారి షూటింగ్ వాయిదా పడడానికి కారణం ఎన్టీఆరే అట. ఎన్టీఆర్ వ్యక్తిగత కారణాలతో రెండు రోజులు విశ్రాంతి కావాలని కోరడంతో జక్కన్న షూటింగ్‌ను ఆపారట. ఇక ఈ సినిమా షూటింగ్ రెండు రోజుల తర్వాత తిరిగి ప్రారంభమవుతుందని తెలుస్తోంది.
అయితే ఈ రెండు రోజులు గ్యాప్ ఫస్ట్ లుక్‌పై మాత్రం ప్రభావం చూపబోదని ఫస్ట్ లుక్‌ను మాత్రం అనుకున్న టైంకే రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఇక అన్ని కుదిరితే వచ్చే సమ్మర్‌కు ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నా అది ఎంత వరకు సాధ్యమో తెలియట్లేదు.