హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ముంబైకు చెందిన ఓ యువతిని బర్త్ డే పార్టీ ఉందని ఇక్కడకు రప్పించి ఆమెకు మద్యం తాగించి ఆమెపై అత్యాచారం చేశారు. దీంతో ఆ యువతి ముంబై పోలీసులను ఆశ్రయించింది. మిత్రుడు క్రిష్ణ చౌదరితో బాధితురాలికి ప్రజక్త అనే యువతి పరిచయం అయ్యింది. ప్రజక్త తనకు కొన్ని సమస్యలు ఉన్నాయంటూ ముంబైలోనే బాధితురాలి ఇంట్లో ఉంటోంది. ప్రజక్త స్నేహితురాలు అయిన స్వీటీ మే 10న ఫోన్ చేసి హైదరాబాద్‌లో మిత్రుడి పుట్టిన రోజు ఉందని ఆహ్వానించింది.
దీంతో ఈ యేడాది మే 11న హైదరాబాద్‌కు వచ్చిన ప్రజక్త, బాధితురాలు ఓ హోటల్లో దిగారు. తర్వాత ప్రజక్త, ఆమె స్నేహితురాలు జుబేర్, వాళ్ల ఫ్రెండ్ జుబేర్ కలిసి ఆమెకు బలవంతంగా మద్యం తాగించారు. ఆమె మత్తులోకి వెళ్లగానే జుబేర్ ఆమెను లైంగీకంగా వేధించడంతో పాటు ఆమెపై అత్యాచారం చేశాడు.
ఆ తర్వాత స్వీటి, జుబేర్ వెళ్లిపోయారు.. తనపై జరిగిన అన్యాయానికి కుమిలిపోయిన బాధితురాలు మే 14న ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆమె ఫ్రెండ్ ప్రజక్త బాధితురాలు బట్టులు మార్చుకున్నప్పుడు తీసిన న్యూడ్ వీడియోలు ఆమెకు వాట్సాప్ చేసి కేసు వాపస్ తీసుకోవాలని బెదిరింపులకు దిగింది. దీంతో బాధితురాలు మరోసారి పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు నిందితుల కోసం వెతుకుతున్నారు.