ప్రస్తుతం అందాల ముద్దుగుమ్మలు అందరు వరుస పెట్టి ప్రెగ్నెంట్ అవుతున్నారు. కరీనాకపూర్, అనుష్క శర్మ, అనిత ఈ లిస్టులోకే ఇప్పుడు మరో అందాల నటి కూడా ఎంట్రీ ఇవ్వనుంది. ఆమె ఎవరో కాదు చక్ దే ఇండియా ఫేం సాగరికా ఘట్గే. టీం ఇండియా క్రికెటర్ జహీర్‌ఖాన్ తమ ఇంట్లోకి మొదటి బిడ్డను ఆహ్వానిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. గత వారం యూఏఈలో తన భర్త పుట్టిన రోజు వేడుకల్లో సాగరిక ఘట్గే పాల్గొన్నారు.
అప్పటి నుంచి ఆమె ప్రగ్నెన్సీకి సంబంధించిన ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. ఆమె బేబీ బంప్ లాగా కనిపించే వదులుగా ఉన్న దుస్తులు వేసుకోవడంతో ఆమె ప్రెగ్నెంట్ అని పలువురు భావిస్తున్నారు. ఇదే విషయం సోషల్ మీడియాల కూడా వైరల్ అవుతోంది. జహీర్ – సాగరికా దంపతులు ప్రస్తుతం యూఏఈలో ఎంజాయ్ చేస్తున్నారు.
జహీర్‌కు ఇప్పటికే 42 ఏళ్లు వచ్చాయి. ఈ క్రమంలోనే సాగరిక వరుసగా జహీర్ ఫోటోలు ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో పాటు భర్త మాత్రమే కాదు. బెస్ట్ ఫ్రెండ్.. నిస్వార్థుడు అని తెగ పొగిడేసింది. ఇక సాగరిక 2007లో వచ్చిన చక్ దే ఇండియా సినిమాలో హాకీ ప్లేయర్ ప్రీతి సభర్వాల్ పాత్రలో నటించి తిరుగులేని ముద్ర వేసుకుంది. ఇందులో షారుఖ్ ఖాన్ హాకీ కోచ్ గా నటించారు. ఇక జహీర్ – సాగరిక జంట ఏప్రిల్ 2017 లో వివాహం చేసుకున్నారు.