దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు కోరలు చేస్తూ విస్తరిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య తో పాటు కరోనా మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఓవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ గురించి పలు పరిశోధనలు జరుగుతున్నాయి. పలు వ్యాక్సిన్లు చేరుకుని క్లినికల్ ట్రయల్స్ లో ఫెయిల్ అవుతున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో కరోనా గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
ఇతర బ్లడ్ గ్రూప్ లతో పోలిస్తే బ్లడ్ గ్రూప్‌నకు చెందిన వాళ్లను తక్కువగా ఎటాక్ చేస్తోందట. డెన్మార్క్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో 7 వేలకు పైగా బ్లడ్ శాంపుల్స్ పరిశీలించగా కరోనా ఓ, ఏ బ్లడ్ గ్రూప్‌నకు చెందిన వారి మధ్య కరోనా కేసుల సంఖ్య ఏకంగా 6 శాతం వ్యత్యాసం ఉందట.
కెనడా శాస్త్రవేత్తలు కరోనా సోకి వెంటిలేటర్లపై చికిత్స పొందుతోన్న వారిని పరిశీలించగా వెంటిలేటర్లపై చికిత్స పొందే వారిలో ఏ, ఏబీ గ్రూపుల వాళ్లు 84 శాతం ఉండగా ఓ లేదా బీ గ్రూపుల వాళ్లు కేవలం 6 1 శాతం మంది మాత్రమే ఉన్నారట. ఓవరాల్‌గా కరోనా మిగిలిన గ్రూపుల వాళ్లకు కూడా ప్రమాదమే అయినా మిగిలిన వారితో పోలిస్తే ఓ బ్లడ్ గ్రూప్‌ల వాళ్లకు తక్కువ శాతం మాత్రమే ప్రమాదకరం.