తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ కీలక నేత, తెలంగాణ రాష్ట్ర తొలి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన న్యుమోనియా కారణంగా ప్రస్తుతం జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సెప్టెంబర్ 28వ తేదీన కరోనా భారీన పడ్డ నాయిని చికిత్స తీసుకోగా పది రోజుల క్రితం కరోనా నెగిటివ్ అని వచ్చింది.
అనంతరం ఆయనకు ఊపిరి తీసుకోవడంలో అనేక సమస్యలు తలెత్తాయి. చివరకు న్యుమోనియా కారణంగా ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకిందని… పరిస్థితి సీరియస్‌గానే ఉందని వైద్యులు చెపుతున్నారు. నాయిని ఆరోగ్య పరిస్థితి విషమం అన్న వార్తలతో టీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.