క్యారెక్టర్ ఆర్టిస్ట్ మురళీశర్మ అల వైకుంఠపురములో సినిమా హిట్ అవ్వడంతో రేటు భారీగా పెంచేశాడన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ సినిమా మురళీశర్మకు మంచి పేరే తీసుకువచ్చింది. ఇప్పటి వరకు సినిమాకు రోజుకు రు 1. 5లక్షలు తీసుకున్న ఆయన ఇప్పుడు ఏకంగా రు. 2.25 లక్షలు డిమాండ్ చేస్తున్నాడట. ఓ వైపు కరోనా దెబ్బతో గిల్ట్ అందరూ రేటు తగ్గించాలన్న కండీషన్లు పెడుతుంటే చివరకు క్యారెక్టర్ ఆర్టిస్టులే ఈ రకంగా రేట్లు పెంచుకుంటూ పోతుంటే ఇక హీరోయిన్లు, హీరోలు మాత్రం రేట్లు తగ్గించుకుంటారని ఆశించడం అత్యాశే అవుతుంది.
గతంలో మురళీశర్మ ప్రతి రోజూ పండగే – అల వైకుంఠపురములో – సరిలేరు నీకెవ్వరూ లాంటి సినిమాలు చేసినప్పుడు రోజుకు 1. 5 లక్షలు తీసుకున్నారట. ఇప్పుడు ఆయన చేతిలో నారప్ప, శ్రీకారం, రాథేశ్యామ్ లాంటి సినిమాలు ఉన్నాయి. ఇవే కాకుండా మరికొన్ని పెద్ద సినిమాల్లోనూ ఆయన్ను తీసుకోవాలని చూస్తున్నారు.
దీంతో మురళీశర్మ తన రేటు రు 2.25 లక్షలకు పెంచడంతో నిర్మాతలు షాక్ అవుతున్నారట. ఇప్పుడు ఆయన్ను తీసుకోవడం కంటే తెలుగులో పేరున్న క్యారెక్టర్ ఆర్టిస్టులను తీసుకోవడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చేశారట. అయితే మరో టాక్ ప్రకారం కనీసం ఇప్పుడు ఉన్న రేటును అయినా కాపాడుకోవాలనే ఆయన రేటు పెంచారని అంటున్నారు. ఏదేమైనా ఈ సంక్లిష్ట సమయంలో నటీనటులు ఇలా రేట్లు కొండెక్కించడం కరెక్ట్ కాదు..!