జెనీలియా భ‌ర్తకు ఘోర అవ‌మానం… తీవ్రంగా హ‌ర్ట్‌

మాజీ హీరోయిన్ జెనీలియా మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ త‌న‌యుడు రితీష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడింది. వీరిద్ద‌రు క‌లిసి తుజే మేరీ క‌స‌మ్ ( తెలుగులో వ‌చ్చిన నువ్వే కావాలి సినిమాకు రీమేక్‌) సినిమాలో న‌టిస్తూనే ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకున్నారు. ఇక రితీష్ ఇద్ద‌రు సోద‌రులు కాంగ్రెస్ త‌ర‌పున లాతూర్ సిటీ, లాతూర్ రూర‌ల్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

 

 

తాజాగా ది క‌పిల్ శ‌ర్మ కామెడీ షోకు జెనిలియా, ఆమె భ‌ర్త రితీష్ గెస్టులుగా రాబోతున్నాడు. ఈ షోలో రితీష్ ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ చెప్పారు. బెంగ‌ళూరులో ఓ సారి క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వెళ్లిన‌ప్పుడు అక్క‌డ ఇద్ద‌రు ప్రముఖ క్రికెట‌ర్లు మీరు జెనీలియా భర్త కదా అని అడిగారని తెలిపారు.  ఆ మాటకు తన ఇగో కొంచెం హర్ట్ అయ్యిందని రితేష్‌ తెలిపారు.

 

దీంతో రితీష్ ఇక్క‌డ నేను జెనీలియా భ‌ర్త‌ను.. మ‌హారాష్ట్ర‌లో తాను రితేష్ భార్య అని చెప్పాడ‌ట‌. అయితే వెంట‌నే ఆ క్రికెట‌ర్లు ఒక్క మ‌హారాష్ట్రలో మాత్ర‌మే ఆమెను రితేష్ భార్య అంటారు. కానీ క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడు, ఏపీలో మిమ్మ‌ల‌ను జెనీలియా భ‌ర్త అనే అంటార‌ని స‌మాధానం ఇచ్చారు అని రితేష్ చెప్పారు. దీంతో అక్క‌డ ఉన్న వారంతా ఒక్క‌సారిగా న‌వ్వారు. ప్ర‌స్తుతం ఈ షో ప్రోమో వైర‌ల్ అవుతోంది.