లావ‌ణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా… వ‌రుడు ఎవ‌రంటూ..!

సొట్ట‌బుగ్గ‌ల లావ‌ణ్య త్రిపాఠి కెరీర్ స‌డెన్‌గా రివ‌ర్స్ గేర్‌లో వెళుతోంది. ప్ర‌స్తుతం ఆమె చావుక‌బురు చ‌ల్ల‌గా, ఏ-1 ఎక్స్‌ప్రెస్ సినిమాలు చేస్తోంది. లావ‌ణ్య‌కు తెలుగు మంచి హీరోల ప‌క్క‌న‌, మంచి హిట్ సినిమాలు వ‌చ్చినా ఆమె ఇక్క‌డ స్టార్ హీరోయిన్‌గా నిల‌దొక్కుకేలేదు. ఇక సినిమా ఛాన్సులు లేక‌పోయినా హైద‌రాబాద్‌లోనే మ‌కాం వేసిన ఆమెకు ఎంగేజ్‌మెంట్ అయిపోయిందంటూ ఒక్క‌టే వార్త‌లు గుప్పుమంటున్నాయి. ఈ పుకార్లు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఆమె చేతికి ఉన్న ఉంగం.

 

లావ‌ణ్య వేలికి ఉన్న ఉంగ‌రం చూసిన నెటిజ‌న్లు ప‌లువురు ఆమెకు ఎంగేజ్‌మెంట్ అయిపోయింద‌ని.. ఆమెకు త్వ‌ర‌లోనే పెళ్లి ఉంటుంద‌ని కామెంట్లు చేస్తున్నారు. ఈ వార్త‌ల‌పై స్పందించిన లావ‌ణ్య అమ్మాయిలు వేలికి ఉంగ‌రం పెట్టుకుంటే ఎంగేజ్‌మెంట్ అయిన‌ట్టేనా..?  అది తాను పుట్టిన రోజు సంద‌ర్భంగా ఎంతో ఇష్ట‌ప‌డి పెట్టుకున్న రింగ్ అని.. అది ఎంగేజ్‌మెంట్ రింగ్ కాద‌ని చెప్పింది.

 

ఇప్పటి వ‌ర‌కు త‌న త‌ల్లిదండ్రులే త‌న ద‌గ్గ‌ర త‌న పెళ్లి ప్ర‌స్తావ‌న తీసుకురాలేద‌ని.. సోష‌ల్ మీడియాలో మాత్రం చాలా మంది బాధ‌ప‌డుతున్నార‌ని ఆమె వాపోయింది. ఇక త‌న‌కు పెళ్లి కుదిరింద‌ని ఎవ‌రికి వారు ఎవరెవ‌రో పేర్లు పెట్టి రాసేస్తున్నార‌ని.. అవ‌న్నీ వారి క‌ల‌లు, గాసిప్‌లు మాత్ర‌మే అని లావ‌ణ్య కొట్టి ప‌డేసింది.