జబర్దస్త్ ప్రోగ్రామ్‌తో టాప్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు అవినాష్. ఈ క్రమంలోనే మనోడు బిగ్‌బాస్ 4 సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో మార్నింగ్ మస్తీ ప్రోగ్రామ్‌లో అమ్మ ప్రేమతో పాటు తన ఫ్యామిలీ కోసం పడిన కష్టాల గురించి చెప్పాడు. తనకు జీవితంలో తల్లిదండ్రులు, ప్రేక్షకులే నా దేవుళ్లు అని… వీరిలో ఎవ్వరిని వేరే చేయలేనని అవినాష్ చెప్పాడు. తన వయస్సు 30 అని.. తాను ఇటీవల ఇళ్లు, కారు కొనుక్కున్నానని.. తాను ఈ స్థాయిలో ఉండడానికి ప్రేక్షక దేవుళ్లే కారణం అని అవినాష్ చెప్పాడు.
ఇక ఇటీవల తాను ఇళ్లు, కారు కొనుక్కున్నానని లాక్ డౌన్ సమయంలో ఆర్థిక కష్టాలతో పోటీ పడలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని అవినాష్ చెప్పాడు. నాన్న హార్ట్ ఆపరేషన్, అమ్మకు కీళ్లకు వైద్యం చేయించడంతో నెలకు రూ.45వేల రూపాయలు కట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నాడు. ఇల్లుకు ముందే కొంత అడ్వాన్స్ ఇవ్వడంతో తప్పనిసరిగా కట్టాల్సి వచ్చిందని.. దీంతో రు. 13 లక్షలు అప్పు చేశానని అవినాష్ చెప్పాడు.
మనకు తల్లిదండ్రులు ఎంతో ముఖ్యం అని.. వారు చనిపోయాక బాధపడడం కంటే వారు ఉన్నప్పుడే బాగా చూసుకోవాలని కూడా అవినాష్ సూచించాడు. అయితే అవినాష్ ఆత్మహత్య ఆలోచనపై అమ్మ రాజశేఖర్ మండిపడ్డాడు. ఆర్టిస్టులు ఇలాంటి ఆలోచనలతో ఉంటే ప్రతి రోజు చనిపోవాలన్నాడు. తాను రు. 6 కోట్లతో ఇళ్లు కట్టానని.. అయితే దానిని అమ్మేశానని.. ఇప్పుడు దానిని చూసుకోవడం తప్ప చేసేదేం లేదని తన బాధ తాను చెప్పుకున్నాడు.