టాలీవుడ్లో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన నువ్వునాకు నచ్చావ్ ( 2001) సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది ఆర్తీ అగర్వాల్. కె. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా సక్సెస్‌లో మేజర్ క్రెడిట్ ఖచ్చితంగా హీరోయిన్ ఆర్తీ అగర్వాల్‌దే. ఆ సినిమాతోనే ఆమె హీరోయిన్గా పరిచయం కావడం.. అప్పటి వరకు అమెరికాలో ఉన్న ఆర్తీని ఓ ఫొటోలో చూసిన నిర్మాత సురేష్‌బాబు పట్టుబట్టి మరీ ఆమె తల్లిదండ్రులను ఒప్పించి ఆమెను హీరోయిన్గా పరిచయం చేశారు.
తర్వాత ఆమె సురేష్ ప్రొడక్షన్లోనే తరుణ్ హీరోగా వచ్చిన నువ్వులేక నేనులేను సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వా త అదే సురేష్ ప్రొడక్షన్లో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన సోగ్గాడు సినిమాలో మరోసారి తరుణ్ – ఆర్తీ జంట కలిసి నటించారు. ఈ రెండు సినిమాల షూటింగ్ టైంలోనే తరుణ్ – ఆర్తీ ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితికి వచ్చేశారు.
ఆ తర్వాత ఆర్తీ సోదరి అతిధి కూడా గంగోత్రి సినిమాతో ఇక్కడ హీరోయిన్గా పరిచయం అయ్యింది. ఇక తరుణ్ – ఆర్తీ ప్రేమ పక్షుల్లా కలిసి తిరిగారు. జీవితాంతం కలిసి జీవించాలనుకున్నారు. అయితే తరుణ్ తల్లికి ఆమెను కోడలిగా చేసుకోవడం ఇష్టంలేదు. తరుణ్ కూడా తల్లి మాటకు ఎదురు చెప్పలేకపోయాడు. దీంతో ఈ జంట విడిపోయింది. ఆ తర్వాత ఆర్తీ కెరీర్ నాశనం అయ్యింది. ఆమె మానసిక ఒత్తిళ్లతో చెడు అలవాట్లకు లోనయ్యింది.
చివరకు మరీ ఊరు పేరు లేని వాళ్ల పక్కన కూడా నటించింది. చివరకు ఆమె చేయించుకున్న ఆపరేషన్ ఫెయిల్ అయ్యి మృతి చెందింది.