Moviesరాజ‌మౌళి - ర‌మ మ‌ధ్య ప్రేమ ఎలా చిగురించిందంటే... అక్క‌డే తొలి...

రాజ‌మౌళి – ర‌మ మ‌ధ్య ప్రేమ ఎలా చిగురించిందంటే… అక్క‌డే తొలి గంట కొట్టిందా…!

రాజ‌మౌళి – ర‌మ‌ను ఇండ‌స్ట్రీలో అంద‌రూ ఆద‌ర్శ దంప‌తులు అని పిలుస్తుంటారు. వీరిది ప్రేమ వివాహం.. అయితే వీరు ఎప్పుడు ప్రేమ‌లో ప‌డ్డారు ?  ఎప్పుడు పెళ్లి చేసుకున్నార‌న్న విష‌యాలు ఆస‌క్తిక‌ర‌మే. ప్ర‌స్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాను డైరెక్ట్ చేస్తోన్న రాజ‌మౌళి ర‌మాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే అప్ప‌టికే ర‌మ‌కు మ‌రో వ్య‌క్తితో పెళ్ల‌య్యింది. కార్తీకేయ కూడా పుట్టాడు. అయితే అత‌డితో ర‌మ‌కు విబేధాలు రావ‌డంతో విడిపోయారు.

 

ఆ స‌మ‌యంలో కీర‌వాణి ఇంట్లోనే ర‌మ ఉండేది. కీర‌వాణి భార్య వ‌ల్లి, ర‌మ స్వ‌యానా అక్క‌చెల్లెళ్లు. దీంతో రాజ‌మౌళి సినిమా డైరెక్ష‌న్ ప్ర‌య‌త్నాల్లో ఉండ‌గా… అన్న ఇంటికి వ‌స్తోన్న క్ర‌మంలోనే రమ‌తో ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారి వారు పెళ్లి చేసుకునే వ‌ర‌కు వెళ్లింది. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన శాంతినివాసం సీరియ‌ల్ నుంచి కూడా ర‌మ‌తో ప‌రిచ‌యం ఉంద‌ట‌.

 

 

ఆ త‌ర్వాత స్టూడెంట్ నెంబ‌ర్ 1 షూటింగ్ స‌మ‌యంలో ఆమె కాస్టూమ్ డిజైనర్‌గా ప‌నిచేసింది. ఆ స‌మ‌యంలో వీరి ప్రేమ పీక్స్‌కు చేరుకోవ‌డంతో వీరు సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. ర‌మ‌కు అప్ప‌టికే కార్తీకేయ ఉండ‌గా.. రాజ‌మౌళి పిల్ల‌ల కోసం ఆరాట ప‌డ‌కుండా ఓ పాప‌ను ద‌త్త‌త తీసుకున్నారు. ఆ పాప పేర మ‌యూఖ‌. ఇక రాజ‌మౌళి కార్తీకేయ‌ను సొంత కొడుకులా చూసుకుంటాడు. కార్తీకేయ జ‌గ‌ప‌తిబాబు అన్న కుమార్తెను పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఏదేమైనా ర‌మ‌, రాజ‌మౌళి ఎంతో ఆద‌ర్శ దంప‌తులు అని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news