Newsగుడ్ న్యూస్‌... రిల‌య‌న్స్ 5G రెడీ...

గుడ్ న్యూస్‌… రిల‌య‌న్స్ 5G రెడీ…

భార‌త‌దేశంలో త్వ‌ర‌లోనే 5జీ సేవ‌లు అందుబాటులోకి తేనున్నామ‌ని రిల‌య‌న్స్ జీయో అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. డిజిట‌ల్ ట్రాన్స‌ఫ‌ర్మేష‌న్ వ‌ర‌ల్డ్ సీరిస్ 2020 వ‌ర్చువ‌ల్ భేటీలో ఆయ‌న ఈ విష‌యం చెప్పారు. ఇప్ప‌టికే మొబైల్ డేటాలో త‌న సేవ‌ల రంగాన్ని సుస్థిరం చేసుకున్న జియో ఇప్పుడు 5జీలో స‌త్తా చాటేందుకు రెడీ అవుతోంది. దేశవ్యాప్తంగా 5జీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని ముఖేష్ అంబానీ తెలిపారు.

 

మొబైల్ డేటా వినియోగంలో ప్రపంచంలో 155 వ స్థానంలో ఉన్న భారత్ జియో వ‌చ్చాక అగ్ర‌స్థానానికి వ‌చ్చింద‌న్నారు. 2జీ నిర్మాణానికి టెలికం కంపెనీల‌కు పాతికేళ్లు ప‌డితే 4జీ నిర్మాణానికి జియోకు కేవ‌లం మూడేళ్లు మాత్ర‌మే ప‌ట్టింద‌న్నారు. జియో ఎప్పుడు అయితే టెలికం రంగంలోకి వ‌చ్చిందో కేవ‌లం 170 రోజుల్లో 10 కోట్ల మంది వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకుంద‌న్నారు.

 

దేశంలో డేటా నెలసరి వినిమయం 0.2 బిలియన్ జీబీ నుంచి 600 శాతం వృద్ధితో 1.2 బిలియన్ జీబీకి చేరుకుంద‌న్న ఆయ‌న 50 కోట్ల ఖాతాదారుల దిశ‌గా రిల‌య‌న్స్ జియో ప్ర‌స్థానం సాగుతోంద‌ని చెప్పారు. కనెక్టివిటీలో మరింత ముందుకు సాగే లక్ష్యంలో భాగంగా హైస్పీడ్, ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్‌ను ప్రారంభించినట్లు ముఖేష్‌ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news