హైదరాబాద్లో నాలుగు రోజుల క్రితమే ముంబై యువతిపై ఓ హోటల్లో రేప్ చేసిన విషయం వెలుగులోకి రావడం సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ విషయం మరువక ముందే ఓ యువతిపై స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బర్త్ డే కేకులో మత్తు మందు కలిపి ఆమె స్పృహలో లేనప్పుడు ఈ దారుణానికి ఒడిగట్టారు.
యువతి మిత్రుడు జోసెఫ్, రాము, నవీన్ ఆమెను బర్త్ డే పార్టీకి పిలిచారు. బర్త్ డే కేకులో మత్తు మందు కలిపారు. ఆమె నిద్రలోకి వెళ్లిన వెంటనే ఒకరి తర్వాత మరొకరు ఘోరంగా రేప్ చేశారు. మత్తు నుంచి మెలుక వచ్చిన యువతి తనపై జరిగిన లైంగీక దాడి నేపథ్యంలో యువకులను నిలదీసింది. అయితే ఈ విషయం ఎవరికి అయినా చెపితే చంపేస్తామని బెదిరించారు.
యువతి అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు ఆమెను హాస్పటల్లో చేర్పించారు. ఆమెను తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో ఆమె తనపై జరిగిన దారుణం గురించి చెప్పింది. ఆ యువతి తల్లిదండ్రులు నిందితులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.