అలనాటి మేటి నటి మంజుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి హీరోల పక్కన నటించి ఎన్నో హిట్లు కొట్టారు. ఆ రోజుల్లో మేటి నటనతో పాటు తిరుగులేని అందం, అభినయం మంజుల సొంతం. ఈ క్రమంలోనే ఆమె తెలుగులో విలక్షణ నటుడు అయిన విజయ్ కుమార్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటికే ఆయనకు పెళ్లయ్యి ఓ కొడుకు కూడా ఉన్నాడు.
ఆ కుమారుడు ఎవరో కాదు ప్రముఖ తమిళ్ హీరో అరుణ్ విజయ్. తెలుగులో రామ్‌చరణ్ బ్రూస్ లీ సినిమాలో అతడు విలన్‌గా కూడా చేశాడు. ఇక మంజుల – విజయ్‌కుమార్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు జన్మించగా.. ఈ ముగ్గురు హీరోయిన్లు. ఈ ముగ్గురు కూడా తెలుగులో నటించారు. వీరే అనిత, శ్రీదేవి, ప్రీతి. శ్రీదేవి తెలుగులో చాలా సినిమాలు చేసింది. నిన్నే ఇష్టపడ్డాను – నీరీక్షణ – పెళ్లికాని ప్రసాద్ – వీర సినిమాల్లో ఆమె నటించింది.
ఇక అనిత దేవి సినిమాలో నటించింది. ఆమె ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేస్తోంది. ఇక ప్రీతి తెలుగులో వైఫ్, ప్రియమైన నీకు , మా అన్నయ్య, రుక్మిణి సినిమాలు చేసింది. ఆమె ప్రముఖ దర్శకుడు సింగం హరి ( సింగం హరిగోపాలకృష్ణన్ నాడార్)ను పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది.