Moviesప్రేమిస్తే పిచ్చోడు భ‌ర‌త్ ఎక్క‌డున్నాడు.. ఏం చేస్తున్నాడంటే...!

ప్రేమిస్తే పిచ్చోడు భ‌ర‌త్ ఎక్క‌డున్నాడు.. ఏం చేస్తున్నాడంటే…!

ప్రేమిస్తే సినిమా వ‌చ్చి 12 ఏళ్లు అయ్యింది. ఆ సినిమా వ‌చ్చి ఇన్ని సంవ‌త్స‌రాలు అవుతున్నా ఇప్ప‌ట‌కి ప్రేక్ష‌కులు మ‌ర్చిపోరు. ఆ సినిమాలో త‌మ న‌ట‌న‌కు ప్ర‌తి ఒక్క‌రు ప్రాణం పోశారు. పేద మెకానిక్‌తో ఓ ధ‌నిక యువ‌తి ప్రేమాయ‌ణం… ఇంట్లో పెద్ద‌లు ఒప్పుకోర‌ని వెళ్లిపోవ‌డం… వాళ్లిద్ద‌రు వేరే ఊర్లో క‌లిసి బతుకుతుండ‌గా.. చివ‌ర‌కు ఆ యువ‌తి కుటుంబ స‌భ్యులు వారిని విడ‌దీసి ఆమెకు మ‌రో అబ్బాయితో పెళ్లి చేయ‌డం.. చివ‌ర‌కు హీరో పిచ్చివాడు అవ్వ‌డం లాంటి క‌థాంశంతో ప్రేమిస్తే తెర‌కెక్కింది.

 

 

కోలీవుడ్‌లో హిట్ అయిన ఈ సినిమాను ద‌ర్శ‌కుడు మారుతితో క‌లిసి కొండేటి సురేష్ తెలుగులో రిలీజ్ చేయ‌గా ఇక్క‌డ కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. ఈ ఒక్క సినిమాతోనే హీరో భ‌ర‌త్ తెలుగులో కూడా మంచిపేరు తెచ్చుకున్నాడు. ఆ త‌ర్వాత అత‌డు అడ‌పా ద‌డ‌పా సినిమాలు చేసినా ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. మ‌హేష్‌బాబు స్పైడ‌ర్ సినిమాలో క‌నిపించిన భ‌ర‌త్ ఇప్పుడు ఎక్క‌డ ఉన్నాడు ?  ఏం చేస్తున్నాడ‌న్న‌ది ఆరా తీస్తే అత‌డు హిందీ, మ‌ళ‌యాళంలో బిజీ అయిన‌ట్టు తెలుస్తోంది.

 

 

2019లో సింబ-పొట్టు-కాళిదాస్ అనే మూడు తమిళ సినిమాల్లో న‌టించిన భ‌ర‌త్ ఈ యేడాది కూడా ఆరేడు సినిమాల‌కు ఓకే చెప్పాడు. అటు బాలీవుడ్‌లో కూడా ప‌లు సినిమాలు చేస్తున్నాడు. స్టార్ హీరోగా రాణించ‌లేక‌పోయినా క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగాను, స‌పోర్టింగ్ హీరోగాను భ‌ర‌త్ స‌త్తా చాటుతూనే ఉన్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news