మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తోన్న ఆచార్య తర్వాత వరుసగా క్రేజీ ప్రాజెక్టులకు ఓకే చెపుతూ వస్తున్నారు. ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ డైరెక్షన్‌లో వేదాళం, ఆ తర్వాత వినాయక్ డైరెక్షన్‌లో లూసీఫర్ రీమేక్‌లో నటించేందుకు ఓకే చెప్పాడు. ఈ రెండు సినిమాలకు చిరు రు. 50 కోట్ల చొప్పున మొత్తం రు. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోనున్నట్టు సమాచారం. ఈ రెండు సినిమాలలో ముందుగా వేదాళం రీమేక్ ప్రారంభమవుతుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ అయ్యాయి.
ఈ రెండు సినిమాల తర్వాత సర్దార్ గబ్బర్‌సింగ్ దర్శకుడు కేఎస్. రవీంద్ర ( బాబి) దర్శకత్వంలో తెరకెక్కే మరో సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాకు కూడా చిరుకు రు. 50 కోట్ల రెమ్యునరేషన్ ముట్టనుందట. ఈ మూడు సినిమాలు వచ్చే యేడాది ప్రారంభమవుతాయి. ఓవరాల్‌గా ఒక్కో సినిమాకు రు. 50 కోట్ల చొప్పున మొత్తం మూడు సినిమాలకు రు. 150 కోట్లు రెమ్యునరేషన్‌గా చిరుకు ముట్టనుంది.
అయితే వీటిని ఎవరు నిర్మిస్తారు ? ఇందులో చరణ్‌కు భాగస్వామ్యం ఉంటుందా ? చిరుకు రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో కూడా వాటా ఉంటుందా ? అన్న ప్రశ్నలకు త్వరలోనే క్లారిటీ రానుంది.