Politicsసీఎం జ‌గ‌న్ రాలేరని విజ్ఞప్తి... చివ‌ర‌కు కోర్టు ఏం చేసిందంటే

సీఎం జ‌గ‌న్ రాలేరని విజ్ఞప్తి… చివ‌ర‌కు కోర్టు ఏం చేసిందంటే

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు సంబంధించిన అక్ర‌మాస్తుల కేసుల్లో కొన‌సాగుతోన్న విచార‌ణ సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే తాజాగా జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుల‌కు సంబంధించిన విచార‌ణ సోమ‌వారానికి వాయిదా ప‌డింది. ప్ర‌స్తుతం ఉన్న సీఎం కోర్టుకు హాజ‌రు కాలేద‌ని ప‌రిస్థితి ఉన్నందున, వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా విచారించాల‌ని జ‌గ‌న్ లాయ‌ర్ కోర్టుకు విజ్ఞ‌ప్తి చేశారు. దీనిని స్వీక‌రించిన సీబీఐ కోర్టు  ఈ మేర‌కు కేసు విచార‌ణ సోమ‌వారంకు వాయిదా వేసింది.

 

జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుపై ఈడీ ప్ర‌త్యేక కోర్టు శుక్ర‌వారం విచార‌ణ ప్రార‌భించింది. జ‌గతి పబ్లికేషన్స్‌ తరపున న్యాయవాది జి.అశోక్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇక ఈ కేసును సీబీఐ ప్ర‌త్యేక కోర్టుకు బ‌దిలీ చేయాల‌ని హైకోర్టులో పిటిష‌న్ వేశామన్నారు. ఈ కేసు త‌దుప‌రి విచార‌ణ ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశామ‌ని ఈడీ ప్రత్యేక కోర్టు తెలిపింది.

 

ఇక ప్ర‌జా ప్ర‌తినిధులు, మాజీల‌పై ఉన్న కేసుల‌ను రోజువారి విచార‌ణ జ‌ర‌పాల‌న్న సుప్రీంకోర్టు మార్గ‌ద‌ర్శ‌కాల నేప‌థ్యంలోనే జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసు గురువారం ఈడీ ప్ర‌త్యేక కోర్టులో విచార‌ణ‌కు వ‌చ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news