ఒకప్పుడు టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ సినిమాలతో మురిపించాడు దర్శకుడు వివి. వినాయక్. ఇప్పుడు వినాయక్‌కు అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు స్టార్ హీరోలు కాదు.. మీడియం రేంజ్ హీరోలు కూడా ఒప్పుకోవడం లేదు. వినాయక్ రేంజ్ అంతలా పడిపోయింది. ఇక ఇప్పుడు వినాయక్‌కు చిరు లూసీఫర్ రీమేక్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చారన్న వార్తలు వస్తున్నాయి. చిరంజీవితో ఠాగూర్ తీసిన వినాయక్ ఆ తర్వాత చాలా యేళ్లకు చిరు రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 సినిమాను డైరెక్ట్ చేశాడు.
అయితే అప్పట్లోనే చిరును సీఎంగా ఊహించుకుని వినాయక్ ఓ కథ రెడీ చేసుకున్నాడట. అయితే రమణ రీమేక్‌గా ఠాగూర్ సినిమా చేయాల్సి రావడంతో ఆ కథను పక్కన పెట్టి.. ఆ కథలో కొంత పార్ట్‌ను ఠాగూర్ కోసం వినాయక్ వాడుకున్నానని పలుమార్లు చెప్పాడు. చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారన్న ఊహాగానాలు బలంగా ఉన్న రోజులు అవి. ఆ సమయంలో చిరుకు మంచి బూస్టప్ ఇచ్చేలా వినాయక్ ఆ కథ రాసుకున్నాడట.
అయితే ఆ సీఎం కథ సెట్ కాకపోవడంతో వినాయక్ ఠాగూర్ చేశాడు. ఇక చాలా గ్యాప్ తర్వాత ఖైదీ నెంబర్ 150 చేశాడు. ఆ టైంలో ఉన్న హీరోలలో మహేష్, పవన్‌తో సినిమాలు చేయలేకపోయానని కూడా వినాయక్ చెప్పాడు.