నందమూరి సుహాసినికి సూప‌ర్ గిఫ్ట్ ఇచ్చిన చంద్ర‌బాబు

దివంగ‌త మాజీ మంత్రి నంద‌మూరి హ‌రికృష్ణ త‌న‌యురాలు అయిన నంద‌మూరి సుహాసిని 2018 తెలంగాణ ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు ఎవ‌రికి తెలియ‌దు. అయితే ఆ ఎన్నిక‌ల్లో ఆమె కూక‌ట్‌ప‌ల్లి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత సుహాసిని అప్పుడ‌ప్పుడు వార్త‌ల్లో ఉంటున్నా మ‌ళ్లీ ఇప్పుడు ఆమె వార్త‌ల్లోకెక్కింది. సుహాసిని రాజ‌కీయంగా మ‌రింత యాక్టివ్‌గా ఉండేందుకు చంద్ర‌బాబు ఆమెకు తెలంగాణ టీడీపీ ఉపాధ్య‌క్షురాలి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు.

 

తెలంగాణ‌లో పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసే క్ర‌మంలో టీటీడీపీ అధ్య‌క్షుడిగా ప్ర‌స్తుతం ఉన్న ఎల్‌.ర‌మ‌ణ‌ను కంటిన్యూ చేసిన చంద్ర‌బాబు నంద‌మూరి వార‌సురాలికి కీల‌క‌మైన ఉపాధ్య‌క్షురాలి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. సుహాసినికి నంద‌మూరి బ్రాండ్ ఉండ‌నే ఉంది. వ‌చ్చే గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో ఆమె పార్టీ త‌ర‌పున విజ‌యం కోసం త‌న వంతుగా ప్ర‌చారం చేసేందుకు రెడీ అవుతున్న‌ట్టు స‌మాచారం.