తెలుగు సినిమాల్లో విలన్ అంటే భారీ కటౌట్ ఉండాలి. చూడడానికి భయంకరమైన ఆకారం…. పవర్ ఫుల్ డైలాగులు.. మనిషిని చూస్తూనే ప్రేక్షకులు వీడు నిజమైన విలన్నా అనుకునేంతగా గెటప్ ఉండాలి. మన తెలుగులో సరైన విలన్లు లేక కొద్ది రోజుల వరకు మనం బాలీవుడ్ విలన్లను దిగుమతి చేసుకునేవాళ్లం. అయితే తెలుగులో ఇప్పుడిప్పుడే సీనియర్ హీరోలు, అవుట్ డేటెడ్ హీరోలు విలన్ల అవతారం ఎత్తుతున్నారు. జగపతిబాబు లాంటి సీనియర్ హీరో ఇప్పుడు ఎలాంటి వేషాలు వేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.
జగపతిబాబు తెలుగులో ఇప్పటికే పలువురు స్టార్, యంగ్ క్రేజీ హీరోల సినిమాల్లో విలన్‌గా నటించి తన సత్తా చాటాడు. జగపతిబాబు కేవలం తెలుగులోనే కాదు తమిళ్, మళయాళంలో సైతం స్టార్ హీరోల సినిమాల్లో విలన్‌గా నటిస్తున్నాడు. అయితే విలన్ల కొరత ఉండడంతో మన తెలుగులో ఎన్టీఆర్, మహేష్, బన్నీ, పవన్ సినిమాల్లో బలమైన విలన్లు ఉండడం లేదు. ఇప్పుడు పుష్ప చేస్తోన్న బన్నీ, సర్కారువారి పాట చేస్తోన్న మహేష్ విలన్ల కొరతతోనే ఇబ్బంది పడుతున్నారట.
ఇప్పటికే సుకుమార్ పుష్ప సినిమా కోసం చాలామంది విలన్లును అనుకున్నా ఒక్కరు కూడా సెట్ కాలేదట. ఇక మహేష్ సినిమాలో విలన్ కోసం పలువురు బాలీవుడ్ నటులను అడిగినా వారు కూడా అనేక కండీషన్లు పెట్టడంతో ఆ సినిమాకు కూడా విలన్లు సెట్ కాలేదంటున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి బన్నీ, మహేష్‌ల కోసం ఇప్పుడు తెలుగు విలన్ల పేర్లనే పరిశీలిస్తున్నారట. ఏదేమైనా స్టార్ హీరోల సినిమాలకు విలన్ల కొరత అంటే విచిత్రమే..?