Gossipsప‌వ‌న్ రేటు రోజుకు కోటిన్న‌ర‌... మామూలు ప్లాన్ కాదుగా...!

ప‌వ‌న్ రేటు రోజుకు కోటిన్న‌ర‌… మామూలు ప్లాన్ కాదుగా…!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేతిలో ప్ర‌స్తుతం ఐదు సినిమాలు ఉన్నాయి. వ‌కీల్‌సాబ్ త‌ర్వాత క్రిష్ సినిమా ఉంది. అది క‌రోనా కారాణంగా లేట్ అవ్వ‌డంతోనే ప‌వ‌న్ సొంత మేన‌ళ్లుడుతో క్రిష్ సినిమా చేస్తున్నాడు. దీంతో క్రిష్ ఓ రెండు నెల‌ల పాటు ఆ సినిమా ప‌నుల్లో బిజీ కానున్నాడు. ఈ నెలన్నర రోజులోనే వేరే సినిమాకు వాడుకోవాల‌ని ప‌వ‌న్ అదిరిపోయే స్కెచ్ వేశాడ‌ట‌. ఇప్ప‌టికే క‌మిట్ అయ్యి, అడ్వాన్స్‌లు తీసుకున్న సినిమాలు చేసినా చేయ‌క‌పోయినా ఇబ్బంది ఉండదు.

Happy Birthday Pawan Kalyan: Tollywood celebs wish the actor on turning 49  | Telugu Movie News - Times of India

వాళ్లు ఎలాగూ అడ‌గ‌రు.. ప‌వ‌న్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు. అలా కాకుండా క్రిష్ త‌న మేనళ్లుడు సినిమాను కంప్లీట్ చేసే టైంలో మ‌రో సినిమా చేసేస్తే ప‌వ‌న్‌కు అద‌న‌పు ఆదాయం ఉంటుంది. మ‌హా అయితే ఓ నెల‌న్న‌ర రోజులు క‌ష్ట‌ప‌డితే చాలు. ఇంత‌కు ప‌వ‌న్ ఈ గ్యాప్‌లో చేస్తోన్న ఆ కొత్త సినిమా ఏదో కాదు అయ్యప్పన్ కోషియమ్. ఇది రీమేక్ సినిమా కావ‌డంతో పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన ప‌ని కూడా ఉండ‌ద‌న్న‌దే ప‌వ‌న్ ప్లాన్‌.

Pawan Kalyan to start one more remake from January

ఈ సినిమాలో న‌టించే 30 – 35 రోజుల‌కు కాను ప‌వ‌న్‌కు రు. 50 కోట్ల రెమ్యున‌రేష‌న్ వ‌స్తుంద‌న్న‌మాట‌. అంటే గ‌ట్టిగా ఓ నెల రోజులు క‌ష్ట‌ప‌డితే ప‌వ‌న్‌కు ఎలాలేద‌న్నా రు. 50 కోట్లు ముడ‌తాయి. అందుకే ఇప్పుడు ఫైన‌ల్ స్టేజ్‌లో ఉన్న వ‌కీల్‌సాబ్ కంప్లీట్ అయిన వెంట‌నే ఈ రీమేక్ సినిమా చేసేందుకే ఆస‌క్తితో ఉన్నాడ‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news