బిగ్‌బాస్ హౌస్‌లో జబర్దస్త్ అవినాష్ శుక్రవారం ఎపిసోడ్లో లాక్డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానంటూ చెప్పడంపై అమ్మ రాజశేఖర్ ఫైర్ అయ్యాడు. అలా ఆలోచిస్తే ఆర్టిస్ట్ అనేవాడు ప్రతి రోజు ఆత్మహత్య చేసుకోవాల్సిందే అన్నాడు. ఇక ఈ అంశంపై వీకెండ్ ఎపిసోడ్లో మాట్లాడిన నాగార్జున నోయల్ నామినేషన్ చేసినప్పుడు ఆయన వివరణ వినేందుకు రాజశేఖర్ ఒప్పుకోకపోవడం కరెక్ట్ కాదన్న నాగ్ అవినాష్ విషయంలో మీరు మాట్లాడిన తీరు నచ్చిందని ప్రశ్నించాడు.
ఆత్మహత్య చేసుకోవడం ఏంట్రా మరోసారి ఆ మాట అంటే చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చిన తీరు బాగుందని నాగార్జున అన్నాడు. ఆ సమయంలోనే మీరు రు. 6 కోట్లకు ఇళ్లు అమ్మేశానని చెప్పారు. ఎందుకని నాగ్ రాజశేఖర్‌ను ప్రశ్నించాడు. అందుకు రాజశేఖర్ స్పందిస్తూ మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అని… ఆ ఇంట్లో ఆమె కింద జారి పడిపోయారని అప్పుడు సంవత్సరం పాటు ఆసుపత్రిలోనే ఉన్నామని రాజేశేఖర్ చెప్పాడు.
ఆ ఇళ్లు కలిసి రాదని కొందరు చెప్పడంతోనే తాను ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇంటిని రు. 6 కోట్లకు అమ్మేశానని.. ఇప్పుడు దానిని చూడడం తప్పా ఏం చేయలేమని రాజశేఖర్ చెప్పాడు. అప్పుడు సంవత్సరం పాటు అమ్మతో ఉండటం వల్ల నాకు సినిమాల్లో ఆఫర్లు తగ్గాయని రాజశేఖర్ మాస్టర్ అన్నారు. ఇక ఈ వారం నామినేషన్ లో ఉన్న అమ్మ రాజశేఖర్ మాస్టర్ ఎలిమినేషన్ నుండి సేవ్ అవ్వగా సుజాత బయటకు వచ్చింది.