Newsతిరుప‌తిలో ఉద్యోగం ఎర‌... యువ‌తికి మ‌ద్యం తాగించి వ్య‌భిచారం దందా... క్లైమాక్స్...

తిరుప‌తిలో ఉద్యోగం ఎర‌… యువ‌తికి మ‌ద్యం తాగించి వ్య‌భిచారం దందా… క్లైమాక్స్ ట్విస్ట్‌..!

ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన తిరుప‌తి న‌గ‌రంలో దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తాని ఖ‌మ్మం జిల్లాకు చెందిన ఓ యువ‌తిని బ‌ల‌వంతంగా తిరుప‌తి ర‌ప్పించి అక్క‌డ ఆమెను వ్య‌భిచార కూపంలోకి దించాల‌ని చూశారు. అయితే చివ‌ర్లో ఆ యువ‌తి వారి నుంచి ఎలాగోలా త‌ప్పించుకుంది. పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువతికి తిరుపతికి చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడింది.

 

ఆ య‌వ‌తి త‌నకు ఉద్యోగం కావాల‌ని చెప్ప‌డంతో స‌ద‌రు యువ‌తి ఖ‌మ్మం నుంచి తిరుప‌తి వ‌చ్చేందుకు అంగీక‌రించింది. ఖ‌మ్మం నుంచి కారును బుక్ చేసి తిరుప‌తి వ‌స్తుండ‌గా మార్గ‌మ‌ధ్యంలో క‌ర‌కంబాడీ ద‌గ్గ‌ర మ‌రో ఇద్ద‌రు మ‌హిళ‌లు కూడా కారులో ఎక్కారు. వారిద్ద‌రు ఆ యువ‌తిని బ‌ల‌వంతంగా వ్య‌భిచారం చేయాల‌ని చెప్ప‌డంతో ఆ యువ‌తి అందుకు ఒప్పుకోలేదు.

 

అయితే ఆమెకు బ‌ల‌వంతంగా మ‌ద్యం తాగించి ఆమెను వ్య‌భిచార కూపంలోకి దింపాల‌ని ప్లాన్ చేయ‌డంతో పాటు కొట్టారు. అయితే గాయాల‌తోనే ఆ యువ‌తి అక్క‌డ నుంచి త‌ప్పించుకుని రుయా ఆసుప‌త్రికి వ‌చ్చేసింది. అక్క‌డ నుంచి కూడా ఆ ముఠా ఆ యువ‌తిని బ‌ల‌వంతంగా తీసుకు పోవాల‌ని చూశారు. అయితే పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి ఇద్ద‌రిని అదుపులోకి తీసుకుని ఆమెను ర‌క్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news