బెట్టింగ్ డ‌బ్బుల కోసం అమ్మాయిని చంపేశాడు.. ప‌శ్చిమ‌గోదావ‌రిలో దారుణం

ఐపీఎల్ సీజ‌న్లో బెట్టింగులు ఎలా జ‌రుగుతాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. బెట్టింగ్ రాయుళ్లు డ‌బ్బుల కోసం ఎంత‌కైనా తెగిస్తుంటారు. పోలీసులు ఎంత అప్ర‌మ‌త్తంగా ఉన్నా కూడా బెట్టింగ్‌ల‌కు మాత్రం బ్రేకులు ప‌డ‌డం లేదు. తాజాగా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా లింగ‌పాలెం మండ‌లంలో బెట్టింగ్ డ‌బ్బులు  ఓ బాలిక హ‌త్య‌కు కార‌ణ‌మ‌య్యాయి. క్రికెట్ బెట్టింగ్‌లో రు. 2 వేల కోసం ఓ వ్య‌క్తి బాలిక‌ను చంపేశాడు.

 

లింగ‌పాలెం మండ‌లం తోచ‌ల‌క‌రాయుడి పాలెంలో ఇటీవ‌ల 8 ఏళ్ల బాలిక హ‌త్య‌కు గురైంది. పోలీసులు ఈ కేసును విచారించ‌గా ప్ర‌ధాన నిందితుడు బ‌న్నును అదుపులోకి తీసుకుని విచారించారు. క్రికెట్ బెట్టింగ్‌లో పోయిన రు. 2 వేలు చెల్లించేందుకు బాలిక చెవి దిద్దుల కోసం ఆమెను చంపేశాడు.

 

బ‌న్ను ఐపీఎల్లో క్రికెట్ బెట్టింగ్‌లు వేస్తుంటాడ‌ని. ఈ క్ర‌మంలోనే తెలిసిన వాళ్ల ద‌గ్గ‌ర అప్పులు చేస్తుంటాడ‌ని.. ఈ క్ర‌మంలోనే బెట్టింగుల్లో పోయిన డ‌బ్బుల కోస‌మే ఆ బాలిక‌ను హ‌త్య చేశాడ‌ని పోలీసులు చెప్పారు.