వైఎస్సార్సీపీ అసమ్మతి ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజు వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను ప్రతి రోజు ఏకేస్తూన్నారు. దీంతో రఘురామ ఎలా దొరుకుతారా ? అని వైసీపీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. తాజాగా రఘురామ పబ్‌లో గబ్బులేపుతూ నానా రచ్చ చేసిన వీడియోలు బయటకు వచ్చాయి. ఆయన ఓ పబ్‌లో అమ్మాయితో నోట్లో బీరు పోయించుకుంటోన్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే ఇది నిజమైనా ఫొటోనా ? లేదా ఫొటో షాఫ్ చేశారా ? అన్న సందేహాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫొటో చూస్తే మాత్రం అది ఫొటో షాప్ చేసినట్టుగా అయితే లేదు. పబ్‌లో ఆ యువతి సరిగ్గా ఎంపీ నోట్లోనే మద్యం పోస్తున్నట్లు ఉండగా… ఎంపీ కూడా బీర్ నోట్లో పడాలన్నట్లుగా నోరు తెరిచినట్లు ఉంది. పబ్‌కు వచ్చిన వారు అందరూ కూడా ఎంపీని చూస్తున్నారు.
ఇక రఘురామ ఎప్పుడు దొరుకుతాడా ? అని ఎదురు చూస్తోన్న వారు అందరూ ఈ ఫొటో ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. ప్రసస్తుతం వైసీపీ సోషల్ మీడియా వాళ్లంతా రఘురామను ఆడుకునే పనిలో మునిగిపోయారు. ఈ ట్రోలింగ్లపై మీరు కూడా ఓ లుక్కేయండి.