వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామ కృష్ణంరాజు రోజూ ఢిల్లీ నుంచే ప్రెస్‌మీట్లు పెడుతూ జగన్‌ను, వైసీపీ ప్రభుత్వాన్ని ఏకేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు తన విమర్శల పరంపరను కంటిన్యూ చేశారు. తాను విద్యావిధానం గురించి మాట్లాడితే అభినందించాల్సింది పోయి తనను పదవి నుంచి డిస్ క్వాలీఫై చేయాలని చూశారని ఆయనన మండిపడ్డారు. పార్టీపై అభిమానంతో ప్రభుత్వంపై గౌరవంతోనే తాను మాట్లాడానని చెప్పారు.
ఈ క్రమంలోనే రఘురామ సీఎం జగన్‌కు కొన్ని సూచనలు కూడా చేశారు. మిమ్మలను ఎవరైతే ఎంకరేజ్ చేశారో వారిలో ఒక పనికిమాలిన వెధ ఉన్నాడు. ఆ వెధవ ఎవరో రాష్ట్రంలో చాలా మందికి తెలుసు.. ఆ వెధవే మీకు చెప్పాడట. నేను డిస్‌క్వాలిఫై చేయించేస్తానని చెప్పాడట.. అలాంటి పనికిమాలిన వెధవను మీరు పక్కన పెట్టి.. మీ మనస్సుతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు.
మీ మనస్సుతో పాటు మీ కోటరి సభ్యులతో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని రఘురామ సీఎం జగన్‌కు సూచించారు. తప్పులు చేయడం సహజమే అని.. ఇంగ్లీషు మీడియం కోసం చేసిన తప్పును వెనక్కు తీసుకోవాలని… అంతర్వేది విషయంలో కూడా తాను చేసిన సూచనలు తీసుకోవాలని రాఘురామ విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే రఘురామ చేసిన పనికిమాలిన వెధవ వ్యాఖ్యల నేపథ్యంలో ఆ వ్యక్తి ఎవరన్న దానిపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కొందరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో పాటు రఘురామ అభిమానులు మాత్రం ఆయన ఆ వ్యాఖ్య చేసింది ఓ ఎంపీని ఉద్దేశించే అంటున్నారు.